Diwali 2024: అక్టోబర్ 31నే దీపావళి జరుపుకోవాలి..!
One India Telugu Exclusive: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారు. దుర్మర్గుడైన నరకాసురుడిని సత్యభామ అంతమొందించడంతో అందరు సంబురాలు చేసుకుంటారు. ఆ రోజే అందరూ దీపావళి చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దీల పండుగను జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది.అయితే అమావాస్య రెండు రోజులు ఉండడంతో పండుగ జరుపుకోవడం సందిగ్ధత ఏర్పడింది. అక్టోబర్ 31 దీపావళి జరుపుకోవాలా లేక నవంబర్ 1న పండుగ జరుపుకోవాలనే దానిపై చర్చలు కొనసాగుతోన్నాయి.
అయితే అమావాస్య అక్టోబర్ 31 అంటే గురువారం మధ్యాహ్నం మొదలవుతోందని హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ సెవెన్ టెంపుల్ ప్రధాన అర్చకులు రవీంద్రాచార్యులు చెప్పారు. ఈ అమావాస్య మరుసటి రోజు అంటే నవంబర్ 1న సాయంత్రం ముగుస్తుందని వివరించారు. దీపావళి సంబంధించి సాయంత్ర నుంచి రాత్రి పూజలు నిర్వహిస్తారని.. ఈ నేపథ్యంలో గురువారం రోజే పండుగ జరుపుకోవాలని ఆయన చెప్పారు. భక్తిశ్రద్ధలతో కేదరేశ్వర స్వామి నోములు నోచుకోవాలని సూచించారు.

అలాగే కార్తీక మాసం సందర్భంగా సనత్ నగర్ హనుమాన్ ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రవీంద్రచార్యులు వివరించారు. కార్తీక మాసంలో ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య దేవుడికి దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుందని తెలిపారు. వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు అమావాస్య స్టార్ట్ అవుతుంది. నవంబర్ 1 సాయంత్రం 5 గంటల 14 నిమిషాలకు అమావాస్య వెళ్లిపోతుంది. దీంతో అక్టోబర్ 31న పండుగ జరుపుకోవాలని పలువురు పండితులు వివరిస్తున్నారు.
అయితే కొంత మంది మాత్రం నవంబర్ 1న దీపావళి జరుపుకోవాలని చూచిస్తున్నారు. అయితే సెలవు విషయానికి వస్తే కొన్ని సంస్థలు గురువారం రోజు సెలవు ఇవ్వగా.. మరికొన్ని సంస్థలు శుక్రవారం హాలీడే డిక్లేర్ చేశాయి. ప్రభుత్వం అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. దీంతో చాలా మంది గురువారం రోజే పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications