దుబాయ్ శేఖర్‌కు సెగ తగిలింది, అందుకే: విడిచిపెట్టమంటూ కేసీఆర్‌పై డీకే అరుణ నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ. సోమవారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాయన్నారు.

దుబాయ్ శేఖరంటూ కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్
హుజురాబాద్ బీజేపీ గెలుపు దుబాయ్ శేఖర్‌కు సెగ తగిలించిందంటూ ఎద్దేవా చేశారు డీకే అరుణ. ఆ రిజల్ట్ చూసి ఆయన దిమ్మ తిరిగిందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్నారు. 1200 మందిని చంపి... ఈ రోజు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి గెలుపులు సహజం అని ఇప్పుడు అంటున్నారు.. ఆయనకు ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుందన్నారు అరుణ. హుజూరాబాద్‌లో అన్ని డబ్బు లు ఎందుకు ఖర్చు పెట్టావు కేసీఆర్ అని ప్రశ్నించారు.

తెలంగాణ ద్రోహే కాదు.. దేశ ద్రోహి కూడా: కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్
దళిత బంధును ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని లేదంటే విడిచి పెట్టమని డీకె అరుణ స్పస్టం చేశారు. నువ్వు(కేసీఆర్) బయటకి రావాల్సిందే.. తెలంగాణకు ఏమి చేశావో చెప్పా ల్సిందేనన్నారు. కేసీఆర్ నువ్వు తెలంగాణ ద్రోహివే కాదు.. దేశద్రోహి వి కూడా .. భారతీయుడిగా మాట్లాడినవా సోయిలేదా? అంటూ ఆమె కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోష్ బాబు మరణాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావ్.. ప్రజలు అన్ని గమినిస్తున్నారు.. అహంకారాన్ని ఇకనైనా దించుకో అంటూ డీకే అరుణ విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ ఎంతకైనా దిగజారుడతాడంటూ డీకే అరుణ
భారత సైనికుల గురించి మాట్లాడినవ్ అంటే ఎంతకన్నా దిగజా రుతావు... పెట్రోల్, డీజిల్ పై కేసీఆర్ ధరలు తగ్గించడు కానీ కేంద్రం మాత్రం తగ్గించాలా ? అని మండిపడ్డారు. వ్యాట్ పెంచలేదని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. మద్యాన్ని వ్యాపారంలా చేశారని, మద్యం ఆదాయం రూ.6 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెరిగిందన్నారు. సీఎంగా రోల్ మోడల్‌గా ఉండాలి... నువ్వు తాగితే తాగు, కానీ తాగిపించి కుటుం బాలను నాశనం చేస్తున్నావని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు. బూతులు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ నీ తండ్రి పై పెట్టు కేసు.. తెలంగాణ రాకముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడెంతా చెప్పు తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసనని ప్రజలు క్షమించరని దుయ్యబట్టారు డీకే అరుణ.
Recommended Video

కేసీఆర్‌వి అబద్ధాలంటూ మాజీ ఎంపీ వివేక్ విమర్శలు
మరోవైపు, బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి కూడా సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. దేశ ప్రజలకు మేలు చేయడం కోసం కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 సుంకం తగ్గించిందన్నారు. 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు సుంకం తగ్గించాయని తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం తాము వ్యాట్ పెంచలేదని మీడియా సమావేశంలో చెప్పడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోలియం ప్రాడక్ట్స్ పై వేసిన వ్యాట్ తో భారీగా లాభాలు వచ్చాయన్నారు.పెట్రోల్ ధరలను కేంద్రమే తక్కువ చేసుకోవాలని కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నారు. పెట్రోల్, లిక్కర్ పై వేసిన ట్యాక్స్ తోనే భారీగా లాభాలు వచ్చాయన్నారు. పెట్రోల్, డీజిల్ పై వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు వివేక్. రాష్ట్రానికి వచ్చిన లాభాలను సరిగా ఉపయోగించకుండా... కమీషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఖర్చు చేసి..ఆంధ్రా కాంట్రాక్టర్లను ధనికులను చేసిన నేత కేసీఆర్ అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications