జూపల్లి.. జూలో పిల్లి, మేం కాపలా కుక్కలం: డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూపల్లి జూలో పిల్లి అని, ఆయన వ్యాఖ్యలకు తాను స్పందించనని చెప్పారు. ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడితే స్పందిస్తానని చెప్పారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అవినీతిలో ఉన్న వారంతా కెసిఆర్ బినామీలే అన్నారు. అక్రమాలు అడ్డుకోవడానికే కాపలు కుక్కల్లా తాము పని చేస్తామని డీకే అరుణ చెప్పారు.
ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకొని, ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడిచే నైపుణ్యం లేని వారికి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతిని సహించబోమని, కెసిఆర్ దోపిడీని అడ్డుకునేందుకు కాపలా కుక్కలా ఉంటామన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications