కట్టప్ప కేసీఆరే!.. మాలో నుంచే బాహుబలి పుట్టుకొస్తాడు: డీకె అరుణ

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే తెలుగులో బాగా పాపులరైన 'ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని' అనే పాట గుర్తుకురాకమానదు. అధికార టీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ 'మాకోసం బాహుబలి వస్తాడు' అంటూ కొత్త రాగం అందుకోవడం జనంలో ఈ అభిప్రాయాలు కలిగేలా చేస్తోంది.

సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తిన ఈ బాహుబలి చర్చ రాష్ట్రంలో ఇప్పుడు జోరుగా జరుగుతోంది. జానారెడ్డి వ్యాఖ్యలకు కొనసాగింపుగా పలువురు కాంగ్రెస్ నేతలు సైతం 'బాహుబలి వస్తాడు' అంటూ స్టేట్‌మెంట్ లు ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే డీకె అరుణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

DK Aruna on Janareddy bahubali's statement

బాహుబలి కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తాడని, తమలోనే ఒకరు బాహుబలి అవుతారని డీకె అరుణ స్పష్టం చేశారు. అయితే కట్టప్ప మాత్రం సీఎం కేసీఆరే అని ఆమె ఎద్దేవా చేశారు. బాహుబలిని వెన్నుపోటు పొడిచింది కట్టప్పేనని, ఇప్పుడు నడుస్తోంది బాహుబలి-2 అని డీకె అరుణ చెప్పారు.

కాగా, ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు బాహుబలి వస్తాడని సీఎల్పీ నేత జానారెడ్డి శుక్రవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సినిమాను ఎవరో క్లోజ్ చేస్తారో ఆయనే బాహుబాలి అంటూ జానారెడ్డి చమత్కరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLA DK Aruna responded on CLP Leader Janareddy's 'Bahubali' statement. She also reiterate that bahubali will come for next elections to help for congress win
Please Wait while comments are loading...