వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే డికె అరుణ కూతురు స్నిగ్ధారెడ్డిపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్ : అనుమతులకు మించి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూతురు డీకే స్నిగ్ధారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ధరూర్ ఎస్‌ఐ అంజద్‌ఆలి తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం శివారులో డీకే స్నిగ్ధారెడ్డికి సంబంధించిన క్రషర్ ప్లాంట్‌లో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ చేపట్టారని మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఇటీవల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

 DK Aruna's daughter Snigdha Reddy booked

మన్నాపురం శివారులో ఒక హెక్టారుకు అనుమతి తీసుకొని, సర్వేనంబర్ 135-327లో అనుమతులకు మించి 6,16,239 క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో కేసు నమోదు చేశామని చెప్పారు.

హైకోర్టు ఆదేశాల మేరకు మైనింగ్ డైరెక్టర్‌ను అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేయడంతో స్నిగ్ధారెడ్డిపై పీపీ యాక్టు కింద ఐపీసీ 420, 447, 379 కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

English summary
Congress Gadwal MLA DK Aruna has been booked at Mahaboobnagar alleging illegal mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X