ఎగ్జిట్ పోల్స్ నమ్మను, కాంగ్రెస్ నేతలతో టచ్ లో కేసీఆర్ - డీకే సంచలనం..!!

తెలంగాణలో అధికారం దక్కేదెవరికి. మరి కొద్ది గంటల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది తేలి పోనుంది. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎగ్టాక్జ్ పోల్స్ లో తమదే విజయమని ధీమాగా కనిపిస్తోంది. హంగ్ వస్తుందనే చర్చ వినిపిస్తోంది. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. ఫలితాలు..కేసీఆర్ వ్యూహాల పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పెరుగుతున్న ఉత్కంఠ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోరు సాగింది. కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కానీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. తమదే విజయమని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 4న కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు.

DK Shiva Kumar made sensational comments on Telangana assembly Results

అటు కాంగ్రస్ నేతలు ప్రజా తీర్పు తమకే అనకూలంగా ఉందంటూ 70కి పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక...హంగ్ పైనా కొంత సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఈ రోజు హైదరాబాద్ వస్తున్న డికే శివకుమార్ ఫలితాలు పూర్తయ్యే వరకు ఇక్కడే మకాం వేయనున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్: ఇదే సమయంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్‌ పోల్‌ సర్వేలు చేయిస్తానని డీకే చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్‌ ఉందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పవర్‌లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్‌ నేతలకు టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ నేతలను కేసీఆర్‌ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు.

DK Shiva Kumar made sensational comments on Telangana assembly Results

పార్టీల అప్రమత్తం: అటు కాంగ్రెస్ నేతలు ఈ నెల 9న తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నారు. సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెబుతున్నా..ఎవరికి వారు పలితాలు వెల్లడి తరువాత లాబీయింగ్ కు సిద్దం అవుతున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఆందోళన అవసరం లేదని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని నమ్మకం కలిగిస్తున్నారు.

పోటీలో ఉన్న అభ్యర్దుల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్ సరళి పైనా సూక్ష్మ స్థాయిలో విశ్లేషణలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ గెలుపు పై ధీమాగా కనిపిస్తున్నా.. తుది ఫలితాల పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+