TSPSC AE పేపర్ లీక్ చేసి రూ.25 లక్షలు వసూలు చేసిన డాక్యా..!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేయడం ద్వారా డాక్యా నాయక్ రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో రూ.10 లక్షలు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు ఇచ్చిన సమాచారం. పేపర్ లీక్ కేసులో ఏ10 షమీమ్, ఏ11 రమేశ్, ఏ12 సురేశ్ రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న సిట్ వారిని విచారిస్తుంది. ఈ ముగ్గురు నిందితులు ప్రవీణ్ నుంచే పేపర్ తమకు వచ్చిందని స్టేట్ మెంట్ ఇచ్చిట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ ఏఈ పేపర్లను రేణుక, డాక్యాకు ఇచ్చినప్పుడు అడ్వాన్స్ గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు అంటే మొత్తం రూ.10 లక్షలు తీసుకున్నాడు. డ్యాక్యా ఈ పేపర్ తో రూ.25 లక్షలు వసూలు చేశాడు. రేణుక, డ్యాక్యా దంపతులు నీలేశ్, గోపాల్ నాయక్ కు రూ.13.5 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నీలేశ్, గోపాల్ తమ వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టి పేపర్ కొనుగోలు చేశారు.

ఆ తర్వాత డ్యాక్యా భార్య రేణుకకు తెలియకుండా రాజేందర్ రూ.5 లక్షలకు, ప్రశాంత్ రెడ్డి రూ.7.5 లక్షలకు అమ్ముకున్నాడు. ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్ పేపర్లు 16 మందికి లీకైనట్లుగా సీట్ గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి.. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసినట్లు సీట్ గుర్తించుంది. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీక్ చేశారు.
ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్ గుర్తించారు. వీరు ప్రవీణ్, రాజశేఖర్ ను ప్రశ్నించారు. దీంతో వారు షమీమ్, రమేశ్ కు పేపర్ లీక్ చేశారు. డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. షమీమ్, రమేశ్ నుంచే న్యూజిలాండ్ లోని రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి పేపర్ లీక్ చేశారు.












Click it and Unblock the Notifications