తెలంగాణ ఎన్నికలపై సీఎం స్టాలిన్ నిర్ణయం ఇదే: మిత్రుడు కేసీఆర్‌కు షాక్
హైదరాబాద్/చెన్నై: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కెే లక్ష్మణ్.. ఇలా సీనియర్లందరూ జిల్లాస్థాయిలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం లభించింది. కాంగ్రెస్ పార్టీ- తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. తన మద్దతును తెలిపింది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. విజయం సాధించాయి. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అదే విధానాన్ని తెలంగాణలోనూ అనుసరించింది డీఎంకే. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పని చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. భారీ మెజారిటీతో గెలిపించేలా క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు.

నిజానికి- జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పలుమార్లు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. స్వయంగా చెన్నైలోని ఆయన నివాసానికీ వెళ్లారు. అక్కడే భోజనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కూటమిని కట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆయనతో చెలిమి కొనసాగించారు.
ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. పొత్తు ధర్మాన్ని పాటించారు స్టాలిన్. కేసీఆర్‌తో ఉన్న చెలిమి కంటే కాంగ్రెస్‌తో ఉన్న పొత్తుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపునకే తాము పని చేస్తామని స్టాలిన్ ప్రకటించారు.
We thank our ally DMK for their support to the Congress in Telangana. The strengthening of INDIA alliance further will go a long way in the run up to the 2024 alliance.
— Telangana Congress (@INCTelangana) November 21, 2023
Congress will win Telangana along with all its like minded allies who are standing by us in this fight… https://t.co/m8fWcGKQDL
తమ పార్టీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో- తెలంగాణ కాంగ్రెస్.. సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఈ సమాచారాన్నిపోస్ట్ చేసింది. సమ్మిళిత భారత్ కోసం ఉమ్మడిగా కలిసి పోరాడామని పిలుపునిచ్చింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న భూస్వామ్య, మతతత్వ శక్తులను తరిమికొడదామని పేర్కొంది.
-
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
50 ఏళ్ల శాపాన్ని స్టాలిన్ చెరిపేస్తారా?: డీఎంకేకు 'వరుస' గండం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications