హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో సీటు రాదేమోనని యువ వైద్యుడు ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు సీటు రాదేమోనని తీవ్ర ఒత్తిడికి గురైన ఓ యువ వైద్యుడు, ఇంటర్‌మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ఫెయిల్‌ అవుతానేమోనన్న భయంతో ఓ విద్యార్థిని సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు హైదరాబాదు నగరంలోని సైదాబాద్‌లో చోటుచేసుకున్నాయి.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మట్టా మనోహర్‌ రెడ్డి కుటుంబం సైదాబాద్‌ ఇంద్రప్రస్థ కాలనీలోని పుష్పా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. ఆయన కుమారుడు వరుణ్‌రెడ్డి(24) ఆరు నెలల కిత్రం మైసూరులో బీడీఎస్‌ పూర్తి చేశాడు. అమెరికాలో ఉన్నత వైద్య విద్యకోసం యునైటెడ్‌ స్టేట్‌ మెడికల్‌ లైసెన్స్‌ ఎగ్జామినేషన్ ‌(యూఎస్ఎంఎల్‌ఈ)కు సిద్ధమవుతున్నాడు.

Doctor commits suicide fearing of US seat

అతనితో పాటు చదివి ముందుగా యూఎస్ఎంఎల్‌ఈ పరీక్ష రాసిన పెద్దనాన్న కుమారుడికి అమెరికాలో సీటు రాగా, తనకు రాదేమోనని ఆందోళన చెందిన వరుణ్‌రెడ్డి బాల్కనీలో ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన యూపీలోని వారణాసి ప్రాజెక్టులో వరుణ్‌రెడ్డి తండ్రి మనోహర్‌ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడికి గురవుతున్న వరుణ్‌కు కుటుంబసభ్యులు కొంతకాలంగా చికిత్స కూడా చేయిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలావుంటే, సైదాబాద్‌కు చెందిన కిరాణా దుకాణం యజమాని జి. నరేందర్‌ కూతురు సాయి రిషిత(16) దిల్‌సుఖ్‌నగర్‌లోని గాయత్రి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌మీడియెట్‌(ఎంపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలలో నిర్వహించిన తైమ్రాసిక, అర్ధ సంవత్సర పరీక్షలలో మార్కులు తక్కువగా వచ్చాయి. వచ్చే నెలలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు సరిగా రాయలేనన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి సూసైడ్‌ నోటు రాసి ఉరేసుకుంది.

English summary
A doctor has commited suicide with depression fearing of USA seat in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X