చంద్రకళతో తన భర్త సంబంధంపై నోరువిప్పిన శశికుమార్ భార్య క్రాంతి
హైదరాబాద్: చంద్రకళ తన భర్తకు స్నేహితురాలిగానే తెలుసునని హిమాయత్ నగర్ కాల్పులు కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్న అంశాలపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
పోస్టుమార్టం నివేదిక రాకుండానే పోలీసులు కేసును మూసేస్తామంటున్నారని ఆమె అన్నారు. మాదాపూర్‌లో నిర్మించిన లారెల్ ఆసుపత్రి లావాదేవీల్లో సమస్యలు ఉన్నట్లు తన భర్త చెప్పారని ఆమె తెలిపారు. అయితే బయటకు వినిపిస్తున్న వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న చంద్రకళపై కూడా ఆమె స్పందించారు. చంద్రకళ తన భర్తకు స్నేహితురాలిగానే తెలుసునని ఆమె చెప్పారు. ఉదయ్, సాయికుమార్ ఫోన్ చేస్తేనే తన భర్త ఇంట్లోని వెళ్లారని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు కాల్పుల కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ శశికుమార్ మెయినాబాద్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న నేఫథ్యంలో అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.
డాక్టర్ల కాల్పుల కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతారని కమలాసన్ రెడ్డి తెలిపారు.
డాక్టర్ ఉదయ్‌పై కాల్పులు జరిపింది శశికుమారేనని తమ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందన్నారు. ఈ ఘటనలో బుల్లెట్ గాయమైన డాక్టర్ ఉదయం ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ఇంతకు మంచి వివరాలేమి తాను చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications