సిద్దరామయ్య కర్ణాటకకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు

బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.
అన్న భాగ్య పథకానికి కర్ణాటకకు ఇవ్వడానికి సరిపడా బియ్యం స్టాక్‌లో లేవని తెలంగాణాలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో మాట్లాడిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయం చెప్పారు. 'తమకు సరిపడా మాత్రమే బియ్యం ఉన్నాయని, ఎక్కువగా లేవని ఆయన అన్నారు' అని సిద్ధరామయ్య మీడియాతో వెల్లడించారు.

 telangana government

'బియ్యం కోసం కర్ణాటక కూడా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించింది. 1.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగలమని వారు చెప్పారు. కానీ రేటు ఎక్కువ. రవాణా ఖర్చు ఎక్కువ' అని సిద్ధరామయ్య తెలిపారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌తో టచ్‌లో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మను కోరారు. 'సాయంత్రం నేను మీటింగ్ పెట్టాను. చూద్దాం' అని సిద్ధరామయ్య అన్నారు.

అన్ని ప్రాధాన్యతా గృహాలకు (PHH) ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం పంపిణీ చేయడానికి కర్ణాటకకు 4.45 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరం. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 2.17 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటక పొందనుంది. అదనంగా 5 కిలోల బియ్యాన్ని అందించడానికి రాష్ట్రం తన స్వంత వనరుల నుంచి 2.28 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలి.

ఈ వారం ప్రారంభంలో, అన్న భాగ్య పథకాన్ని మోడీ ప్రభుత్వం "నిలిపిస్తోందని" సిద్ధరామయ్య ఆరోపించారు. జూన్ 12న, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్‌ఎస్) కింద 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలన్న కర్ణాటక అభ్యర్థనను ఆమోదించిందని సిద్ధరామయ్య తెలిపారు.

 telangana government

కానీ, జూన్ 13న, కేంద్ర మంత్రిత్వ శాఖ ఎఫ్‌సిఐకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు OMSS "నిలిపివేయబడింది" అని పేర్కొంది. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+