చిరంజీవి ఇంట్లో చోరీ చేసింది ఇతనే: రూ.50వేలతో జల్సా..

Subscribe to Oneindia Telugu
  Chiranjeevi's Jubilee Hills House In Problem | Oneindia Telugu

  హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడి నుంచి రూ.1.50లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బుధవారం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

  పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.25లో నివసిస్తున్న చిరంజీవి ఇంట్లో కర్నూలుకు చెందిన చెన్నయ్య(28) 10సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. రాజీవ్ నగర్ లో నివాసముండే ఇతను.. చిరంజీవి ఇంటి ఆవరణలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.

  అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం చిరంజీవి సిబ్బంది నుంచి కార్యాలయానికి డబ్బులు అందుతుంటాయి. ఇదే క్రమంలో అక్టోబర్ 30న ఖర్చుల నిమిత్తం రూ.4లక్షలను మేనేజర్ గంగాధర్ రావుకు ఇచ్చారు. ఆ డబ్బును గంగాధర్ రావు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని టేబుల్ లో పెట్టాడు.

  Domestic servant who committed theft in Chiranjeevi’s house arrested

  అయితే సాయంత్రం వరకు అందులో కేవలం రూ.2లక్షలు మాత్రమే కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన గంగాధర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెన్నయ్యపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెల్ ఫోన్ ఆధారంగా చెన్నయ్య ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

  నిందితుడు చెన్నయ్య నేరం అంగీకరించినట్టు తెలిపారు. చోరీ చేసిన డబ్బులో నుంచి రూ.50వేలు జల్సాలకు ఖర్చు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. మిగతా డబ్బును స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్ కు తరలించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Police arrested Chennaiah (28) a domestic servant of noted film star, Chiranjeevi. He had committed a theft in the house and had taken away Rs. 2 lakh cash. He was working for the past 10 years.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి