అవాస్తవాలు నమ్మకండి, కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా: నాగార్జున

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై మరోసారి స్పందించారు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున. తాను న్యాయస్థానం వెలువరించే తీర్పునకు కట్టుబడి ఉంటానని, కోర్టు తీర్పు వెలువడే వరకూ ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని నాగార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. N-కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్)యాక్ట్, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది' అని నాగార్జున తెలిపారు.

Don t believe lies Nagarjuna on the demolition of N Convention

అంతేగాక, 'ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించtelటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను' అని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడి చెరువు కబ్జా చేసి ఆ నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదు రావడంతో ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా శనివారం కూడా నాగార్జున స్పందించారు. తాజాగా, మరోసారి ఆయన స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున తెలంగాణ హైకోర్టును శనివారం ఆశ్రయించడంతో.. కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అప్పటికే కన్వెన్షన్ నేలమట్టం కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+