ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానండి: సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ చురకలు
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ పార్టీలోని అసంతృప్త నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలని.. కార్యకర్తలతో జీవితాలతో ఆడుకోవద్దని పార్టీ నేతలను కోరారు. తన మీద కొంతమంది ఫిర్యాదులు చేశారని.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు బండి సంజయ్. అధ్యక్షుడిగా తన కర్తవ్యం నెరవేర్చానన్న సంతృప్తి తనకు ఉందని భావోద్వేగానికి గురయ్యారు.

అయితే, బండి సంజయ్ ముఖ్యం కాదని.. పార్టీనే ముఖ్యమని అన్నారు. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై రానున్న 100 రోజులపాటు ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కేసీఆర్ నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలు బీజేపీకి ఓట్లు వేస్తారని రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటన ఇచ్చారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ నాటకలు మొదలుపెట్టారని విమర్శించారు.
Hearty Congratulations to Hon’ble Union Minister Shri @kishanreddybjp garu for taking charge as @BJP4Telangana President. With able guidance of Hon’ble PM Shri @narendramodi ji, Hon'ble HM Shri @AmitShah ji and @BJP4India National President Shri @JPNadda ji, under your… pic.twitter.com/albTHYwO1G
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 21, 2023
ఈ క్రమంలోనే పీఆర్సీ కమిషన్ వేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని.. ఒకవేళ పీఆర్సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులతో ప్రచారం చేయిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా.. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములయ్యారని తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టమవుతుందన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications