‘ముద్రగడ పద్మనాభం.. రెడ్ల పరువు తీయొద్దు’
పేరు మార్చుకునేందుకు సిద్ధమైన కాపు ఉద్యమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభంకు రెడ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి ఓ లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది.
లేఖతో పాటు ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి. "ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ బలపర్చిన పార్టీ ఘోర పరాజయం పొందినందుకు రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు ఓ ప్రకటన నాలుగు రోజుల క్రితం వెలవడింది. అయితే, వారిని నేను కొన్ని వివరాలు కోరుతున్నాను.. అయ్యా పద్మాభం.. మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అంతేగాక, ఆంధ్రా రెడ్డి సంఘం సభ్యలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు వెంకట రామారెడ్డి. ముద్రగడ పద్మనాభం రెడ్లలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ? అంటూ నిలదీశారు. గౌరవంగా బ్రతికే రెడ్లు.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే.. వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు ఏంటి? అని నిలదీశారు.
ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులుగా మీకు ఉంది. ఇప్పటికైనా సంఘం సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ప్రకటించాలని కోరారు. ఏదైమైనా ముద్రగడ పద్మానభం రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పించ్‌గా, రెడ్డిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కర్రి వెంకట రామారెడ్డి తేల్చి చెప్పారు.
ఇక అసలు విషయానికొస్తే.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో ఎలా గెలుస్తాడో తాను చూస్తానని సవాల్ చేశారు ముద్రగడ పద్మనాభం. ఒకవేళ పవన్ గనుక పిఠాపురంలో గెలిస్తే.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన విషయం విదితమే. అయితే, ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో, ఎన్నికల ఫలితాల తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి
పేరు మార్చుకుంటానని చెప్పారు. తన పేరును పద్మనాభరెడ్డి గా మార్చాలని గెజిట్‌కు దరఖాస్తు చేసుకుంటానని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పద్మనాభంపై పలువురు రెడ్లు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications