డబుల్ ఇంజన్ అంటే ట్రబుల్ ఇంజనే.!అదే టిఆర్ఎస్ ఇంజన్ అంటే అన్నీ సంక్షేమ పథకాలేనన్న హరీష్ రావు.!
ఆందోల్/హైదరాబాద్ : రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను మంత్రి హరీష్ రావు దుమ్మెత్తి పోసారు. రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరిందని, సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడుగుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు. మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగు నీటి కొరత తీరుతుందన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఇక్కడికి సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్నా, ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదనొ, ఇక్కడి ప్రాంతాల రైతులకు చుక్క నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేసారు హరీష్ రావు.

ఎనిమిదేళ్లలో రైతుల కష్టాలు తీర్చాం.. బీజేపి రైతుల కష్టాలను పెంచిందన్న హరీష్ రావు
రైతుల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017-18 లో తాలెల్మా శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రస్తుతం 3 వేల ఎకరాలు, బీడు భూములకు నీరు అందించడం ద్వారా మరో 3, మొత్తం 6 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కేంద్రంలోని బీజేపీ ఒక్క ప్రాజెక్ట్ కు సాయం చేయ లేదని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటోందని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు తెలంగాణ అభివృద్ధికి శరాఘాతంలా పరిణమించాయని హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణకు తప్ప అన్ని ప్రాజెక్టులకు ఇచ్చారన్న మంత్రి హరీష్
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు.. తెలంగాణకు తప్ప అన్ని ప్రాజెక్టులకు ఇచ్చారన్న మంత్రి హరీష్
కర్ణాటక ఎగువ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారని, బుందేల్ ఖండ్ లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, ఏపీలో పోలవరానికి ఇచ్చారని, మనం కాళేశ్వరానికో, పాలమూరు ప్రాజెక్టుకో అడిగితే మాత్రం కేంద్రం మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. మన రాష్ట్ర అభివృద్ధి మనమే చేసుకుంటున్నం తప్ప కేంద్రం ఏమాత్రం సహకారం అందించడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నామన్నారు హరీష్ రావు.

కాళేశ్వరం పూర్తి కాదని హేళన చేసారు.. అసాద్యాన్ని సుసాద్యం చేసామన్న హరీష్
కాళేశ్వరం ప్రాజెక్టు కడతామంటే కొంత మంది హేళనగా నవ్వారని, ప్రాజెక్టు అనివార్యం అన్నారని, కానీ అత్యంత తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మించి చూపించామన్నారు హరీష్ రావు. మూడున్నరేళ్లలో మన దేశంలో ఇంత వేగంగా ఏ ప్రాజెక్టును ఏ ప్రభుత్వం నిర్మించలేదన్నారు. కాని ముడున్నరేళ్లలో ప్రపంచలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించుకున్నామన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో పూర్తి వివక్షకు గురైన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని నిర్ణయించుకోవడంతో అన్నీ సాద్యం అవుతున్నాయన్నారు హరీష్ రావు.

బీజేపీ యువతను రెచ్చగొడుతోంది.. ఉద్యోగాలు అడిగితే కల్పులు జరిపారన్న ట్రబుల్ షూటర్
దేశ జీడీపీ పెంచమంటే బీజేపి ప్రభుత్వం గ్యాస్,డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు హరీష్ రావు. నల్ల ధనం బయటకు వస్తదని చెప్పి, పెద్ద నోట్లు రద్దు చేసి ఇంట్లో ఉండే చిన్న- పెద్ద తేడా లేకుండా ఎంటీఎంల ముందు నిలబెట్టింది బీజేపి ప్రభుత్వం కాదా అని నిలదీసారు. ఎంత నల్ల ధనం తెచ్చారని ప్రశ్నిస్తే మాత్రం నోరు మెదపరని మండిపడ్డారు హరీష్ రావు. అగ్నిపథ్ పేరుతో బీజేపీ ఇవాళ దేశంలో అగ్గి రాజేసిందని, యువత అశాంతితో ఉడికిపోతున్నారని, వారిని పిలిచి చర్చించాల్సింది పోయి, కాల్పులు జరిపితే తెలంగాణ యువకుడు అసువులుబాసాడని హరీష్ ఆవేదన వ్యక్తం చేసారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications