రూ. 50 లక్షలకే డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో..!
హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. విశ్వ నగరంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. అటు భాగ్యనగరంలో జనాభా కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. 2024తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది.
ఇక సామాన్య ప్రజలు హైదరాబాద్ లో బతకడం కష్టంగా మారిపోతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోతున్నాయి. అది ఇంటి అద్దెనా..? లేక నెల జీతమా..? అనే అనుమానం వస్తుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఇళ్లు, ఫ్లాట్ల ధరలకే కాదు అద్దె ఇళ్లకు కూడా రెక్కలు వచ్చాయి. అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు సిటీలో ఉండాలంటే సగం జీతం రెంట్లకే పోతుందని వాపోతున్నారు. అటు సొంతిళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేక మరోవైపు అద్దె ఇళ్ల భారం భరించలేక భాగ్యనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునేవారికి ఇప్పుడో గుడ్ న్యూస్. వారి కల నెరవేరేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని పశ్చిమ వైపు ఉన్న ఐటీ కారిడార్ లో భూముల ధరలు భారీగా పెరిగాయి. కానీ నగరంలోని తూర్పు భాగంలో మాత్రం కాస్త భూముల ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా వరంగల్ హైవే, విజయవాడ హైవే ప్రాంతాల్లో భూములు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. దాంతో ఈ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ధరలు అందుబాటులోనే ఉంటాయని తెలుస్తోంది. రూ. 50 లక్షల నుంచి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. హయత్ నగర్, ఘట్ కేసర్ ప్రాంతాల్లో రూ. 50 లక్షలకే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ దొరికే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications