వేధింపులు: సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: బాలాపూర్‌లోని మినార్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన వాంగూల్మాన్ని రికార్డు చేసింది. భర్త, అత్త, ఆడపడుచు వేధింపులే తన చావుకు కారణమని వీడియోలో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. మినార్ కాలనీలో నివసించే అంజుమ్(20)కు యాకుత్‌పురాకు చెందిన ఇర్ఫాన్‌తో ఈ యేడాది జనవరి 13న వివాహమైంది. పెళ్లి జరిగిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను నిత్య వేధించేవారని, దీంతో తనను పది రోజుల క్రితం తండ్రి పుట్టింటికి తీసుకొచ్చారని అంజుమ్ ఆ వీడియోలో తెలిపింది.

తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరుతూ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమినించి ఒవైసీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కూతురు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications