వరంగల్ లో డ్రగ్స్ కలకలం - గోవా నుంచి తీసుకొచ్చి : నలుగురి అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా కొంత కాలంగా కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతోంది. ఏపీలో డ్రగ్స్ పైన రాజకీయాలు పీక్ కు చేరాయి. టాలీవుడ్ ప్రముఖులను ఈడీ గతంలో విచారించింది. ఇక, ఇప్పుడు తాజాగా వరంగల్ లో డ్రగ్స్ గుట్టు రట్టయింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు.
వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కు చెందిన బీటెక్ విద్యార్థి రోహన్, హైదరాబాద్ కు చెందిన పెంచికల కాశీరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రోహన్ తరుచు గోవా వెళ్లి నైజీరియా దేశస్తులైన జాక్, కాల్ జాఫర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు గుర్తించారు. గోవా నుంచి తీసుకొచ్చి వరంగల్ లో అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు.

మాదాపూర్, సైబరాబాద్ కి చెందిన వారుతో పాటు మత్తు పదార్థాలను సేవిస్తూ మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేయగా మరో యువకుడు పరారీలో వున్నాడు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తం కల్సి హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఓలాడ్జిపై దాడులు నిర్వహించామన్నారు. మత్తు పదార్థాలు సేవిస్తున్న ఆరుగురు యువకులను అదుపులో తీసుకోని విచారించగా, పోలీసులు అరెస్టు చేసిన యువకులందరు స్నేహితులు.
Recommended Video
వీరందరు చదువుకునే సమయంలో మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. గత మూడేళ్ళుగా వీరందరు మత్తు మదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందులో శివ్వా రోహన్ తరుచుగా గోవాకు వెళ్ళి నైజీరియా దేశానికి చెందిన జాక్ మరియు కాల్ జాఫర్లతో వున్న పరిచయంతో వారి వద్ద నుండి కొకైన్, చరస్ మరియు ఇతర రకాల మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాడు. ఆ మత్తుపదార్థాలను రోహన్ తన స్నేహితులు అమ్మడంతో పాటు వారితో పాటు స్థానికంగా వున్న లాడ్జిలో మత్తు పదార్థాలను సేవించేవాడని పోలీసులు వివరించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications