హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా ఆటకట్టు: రాజమండ్రికి చెందిన నలుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ముఠా ఆటను కట్టించారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్‌తో పాటు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన విక్కీ, రాజేష్ గోపిశెట్టి, నరేష్, తోట క్రాంతి కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విక్కీ సులభంగా డబ్బులను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అమ్మకాలను జరుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. విక్కీ, రాజేష్‌లు చిరు వ్యాపారులకు కొకైన్‌ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కాగా, గతంలో కూడా విక్కీ డ్రగ్స్ విక్రయాలను జరిపిన్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇది ఇలావుండగా, మదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీనటుడు నవదీప్ కు(Navdeep) ఈడీ నోటీసులు జారీచేసింది. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ తో పాటు మనీలాండరింగ్ కోణంలోనూ ఈడీ విచారణ చేపట్టనుంది.
ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను విచారించిన విషయం తెలిసిందే. నవదీప్ తన మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేసినట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 81 లింకులు గుర్తించారని తెలిపారు. ఇందులో 41 లింకులపై ఉన్న వివరాలను తెలిపాడని వివరించారు.












Click it and Unblock the Notifications