ఏంది తల్లి ఈ రచ్చ.. ఎంత తాగావ్ ఏంటి..! (వీడియో)

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు (ఫ్రీ బస్సు) పథకాలు అమలైన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల దగ్గర గొడవలు నిత్యకృత్యమయ్యాయి. సీట్ల కోసం, సమయానికి బస్సు ఆపడం లేదంటూ మహిళలు కండక్టర్లతో వాగ్వాదానికి దిగడం చూశాం. అయితే, ఇప్పుడు మీరు చదవబోయే ఘటన వీటన్నింటికీ భిన్నం. ఓ మహిళ ఏకంగా బస్సు కింద దూరి, రోడ్డుపై పడుకుని బస్సును కదలకుండా అడ్డుకుంది!

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి ప్రాంతంలో జరిగింది. ఖమ్మం వైపు వెళ్తున్న ఓ డీలక్స్ ఆర్టీసీ బస్సు అక్కడ ఆగింది. బస్సు ఎక్కిన ఒక మహిళ.. ఖమ్మం వెళ్లడానికి ఉచితంగా టికెట్ ఇవ్వాలని కండక్టర్‌ను కోరింది. అయితే, అది ఉచిత పథకం వర్తించని డీలక్స్ బస్సు కావడంతో కండక్టర్ నిరాకరించారు.

Drunk Woman Creates High Drama Blocks RTC Deluxe Bus Demanding Free Ticket in Bhadradri Kothagudem

దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. అక్కడితో ఆగకుండా, ఒక్కసారిగా బస్సు ముందు భాగంలోకి వచ్చి కదలకుండా కూర్చుంది. స్థానికులు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. మరింత దుందుడుకుగా వ్యవహరించిన ఆమె, ఏకంగా బస్సు కిందకు దూరి బస్సును అడ్డుకుంది!

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళను అతి కష్టం మీద పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా, ఆమె పోలీసులను కూడా డబ్బులు డిమాండ్ చేసింది. తాను ఊరు వెళ్లడానికి డబ్బులు ఇవ్వాలని వారిని కోరింది.

ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు.. ఆ మహిళ విపరీతంగా మద్యం తాగి ఉందని, ఆ మైకంలోనే ఈ రచ్చ చేసి ఉంటుందని చర్చించుకున్నారు. లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకాలం మందుబాబులు రోడ్లపైన, ఫుట్‌పాత్‌లపైన రచ్చ చేయడం చూశాం. ఇప్పుడు ఉచిత పథకం కోసం ఏకంగా మహిళలే ఇలా మద్యం సేవించి ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం చూస్తుంటే, ఈ జాబితాలోకి మహిళలు కూడా చేరారని నెటిజన్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+