సిద్దిపేటలో ఉద్రిక్తత: స్వర్ణ లాడ్జి వద్ద టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల కొట్లాట -దుబ్బాక బైపోల్ నేపథ్యంలో
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు, శ్రేణులు కొట్లాటకు దిగారు. దుబ్బాక బైపోల్ పై సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
ప్యాలెస్ లాడ్జ్‌లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారని తెలుకున్న బీజేపీ శ్రేణులు.. లాడ్జి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. రెండు వర్గాలు తలపడడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గంటపాటు ఈ హైడ్రామా కొనసాగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో నడవటం, బీజేపీ అభ్యర్థులకు చెందినదిగా చెబుతోన్న కోట్లాది రూపాయలు పట్టుపడటం కలకలం రేపింది. బుధవారం జరగబోయే ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలున్నారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 315 బూత్ లను ఏర్పాటు చేసిన అధికారులు.. 89 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ జరుగనుంది. ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం ఇరవై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 10న ఫలితం వెల్లడికానుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications