వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Raghunandan Rao: అయ్యప్ప మాలలో ఉండి అసత్యాలా.. రోహిత్ రెడ్డిపై రఘునందన్ రావు ఫైర్..

|
Google Oneindia TeluguNews

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం తప్పన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని నిలదీశారు. వారి ఆరోపణలే నిజమైతే.. తనపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి రోహిత్‌ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు


తన ఆస్తుల వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్టు రఘునందన్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడానికి సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. రోహిత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్‌రావు గుర్తు చేశారు.

రూ.10 కోట్ల విల్లా

రూ.10 కోట్ల విల్లా


రఘునందన్ రావుపై రోహిత్ రెడ్డి ఆదివారం పలు ఆరోపణలు చేశారు. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్‌చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. రోహిత్ రెడ్డి ఆరోపణలకు రఘునందన్ రావు పై వింధంగా కౌంటర్ ఇచ్చారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ విషయం పక్కన పెట్టి, సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని విమర్శించారు.

2013లో

2013లో


2018 ఎన్నికల ప్రచారంలో దొరలు తిరిగే కారు కావాలా.. అన్నం తినే చేయి కావాలా అని రోహిత్ రెడ్డి అడిగిన విషయాన్ని రఘునందన్ గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మీడియా సమావేశంలో చూపించారు. దమ్ముంటే 2013లో తనపై చేసిన ఆరోపణలను ఎప్పుడు రుజువు చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయమని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

ఈడీ విచారణ

ఈడీ విచారణ


కాగా..ఫైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తను మాలలో ఉన్నానని.. తర్వాత విచారణకు వస్తానని పీఏ ను పంపి ఈడీకి సమాచారం ఇచ్చారు. రోహిత్ రెడ్డి అభ్యర్థను ఈసీ తిరస్కరించడంతో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ రిటర్న్స్, ఐటీ, బ్యాంకు స్టేట్‌మెంట్స్, ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలంటూ ఈడీ నోటీసుల్లో కోరింది.

English summary
Dubbaka MLA Raghunandan Rao reacted strongly to the accusations of Tandur MLA Pilot Rohit Reddy. Dammande challenged him to prove the allegations made against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X