Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చండ్ర రాజేశ్వర రావును ఆంధ్రోడంటారా: కెసిఆర్‌పై నారాయణ

హైదరాబాద్‌: కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావును 'ఆంధ్రోడు' అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్‌ స్మారకంగా హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు కేసీఆర్‌ నిరాకరించారని చెప్పారు.

సోమవారం చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సీఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ప్రస్తుత రాజకీయాలు-ప్రధాన సవా ళ్లు' అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో నారాయణ అధ్యక్షోపన్యాసం ఇచ్చారు. సీఆర్‌ పేరిట పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆస్పత్రి నిర్మాణానికి గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థలం కేటాయిస్తే ఇక్కడ ఆస్పత్రి ఎం దుకని కేసీఆర్‌ అన్నారని చెప్పారు.

Dubbed Chandra Rajeswar Rao as Andhraite: speakers

జాతీయ, అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందిన పోరాటయోధునికి ప్రాంతీయ భావాన్ని అంటగట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపుల వివాదాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇద్దరు సీఎంలు ఇళ్లకు వెళ్లి ఆహ్వానాలు ఇచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇద్దరి ముద్దులాట, గుద్దులాట ఏంటని ప్రశ్నించారు.

దేశ సమగ్రత, భావ సమైక్యతల పై మతోన్మాద శక్తుల బలం ప్రమాదకరంగా పనిచేస్తోందని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. మహాత్మాగాందీ, పటేల్‌, చండ్ర రాజేశ్వర్‌రావు లాంటి మహానుభావులు ప్రజల్లో భావ సమైక్యతను నెలకొల్పి దేశానికి స్వాతంత్య్రం సాధించారని ఆయన చెప్పారు.

Dubbed Chandra Rajeswar Rao as Andhraite: speakers

మత సామరస్యం, జాతి సమగ్రతకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Dubbed Chandra Rajeswar Rao as Andhraite: speakers

కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజశ్వేర రావును ఆంధ్రోడంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖ రావు ఆయన స్మారకంగా నిర్మించే ఆస్పత్రికి స్థలం కేటాయించడానికి నిరాకరించారని సిపిఐ నాయకుడు కె. నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+