సీఐ కుమారుడి రాష్ డ్రైవింగ్: కారు ఢీకొని మహిళ మృతి (వీడియో)
హన్మకొండ: కాజీపేట ఫాతిమానగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓటు వేసి వెళ్తున్న ఓ మహిళను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాలోని దర్గా కాజిపేటకు చెందిన గాదె జోసెఫ్, కవిత భార్యాభర్తలు. వీరిద్దరు గురువారం స్థానిక సెయింట్ గాబ్రియేల్ పాఠశాలలో ఓటు వేయడానికి బైక్‌పై వెళ్లారు. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ ఎక్కుతుండగా ఫాతిమానగర్ నుంచి దర్గా వైపు కారు అతివేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కాగా, మహిళను కారుతో ఢీకొట్టింది ఎక్సైజ్ సీఐ కుమారుడు వంశీ కావడం గమనార్హం.
#JustIn Kazipet road accident!@HiWarangal @TriCityWarangal pic.twitter.com/hY54Ts8LNj
— Fasi Adeeb🇮🇳 (@fasi_adeeb) December 1, 2023
ఈ క్రమంలో వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాజీపేట బ్రిడ్జి వద్ద మృతురాలి బంధువులు శుక్రవారం రాస్తారోకో చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకుంటామని వారికి చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Victim's family protest at Kazipet PS, Warangal demanding justice@DeccanChronicle @oratorgreat @PSKUMAR93070432 @cpwarangal #Telangana pic.twitter.com/malgGfMRZC
— Pinto Deepak (@PintodeepakD) December 1, 2023
ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు: ఎనిమిది మంది మృతి
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. కెంఝహార్ జిల్లా 20వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications