Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rain: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొన్నటి వరకు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కాగా.. తాజాగా మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడసిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, వెల్గటూర్, మద్దునూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి.

ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ వాన కురవడంతో కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పినా ఇంత వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనడంలో జాప్యం జరగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే తడిన వడ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

rain

మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వచ్చిన భారీ వర్షానికి పలు చోట్లు చెట్లు నెలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. వెల్గటూర్ మండలం జగదేవ్ పేటలో పిడుగు పడి క్యాతం రాజయ్య అనే వృద్ధుడు మరణించాడు. రాజయ్య గొర్లను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా, వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు.. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

నల్గొండ జిల్లా చందంపేటలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సూర్యాపేట జిల్లా నాగారంలో 5.6, నల్గొండలోని నేరేడుగొమ్ములో 5.5, మంచిర్యాలలోని తాండూర్​లో 4.1, నాగర్​కర్నూల్​లోని ఉప్పునుంతలలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మేడ్చల్​మల్కాజిగిరి, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వానలతో రాష్ట్రంలో ఉష్టోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు మూడు రోజులతో పోలిస్తే టెంపరేచర్ 1 నుంచి 2 డిగ్రీలు తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం అత్యధికంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్​లోని గంగిపల్లిలో 43.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు అయింది. హైదరాబాద్ 40 డిగ్రీలు ఉష్టోగ్రత నమోదు అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+