టెక్కీలు దుర్గం చెరువుపై నుంచి వెళ్లొచ్చు: కెటిఆర్, లక్నవరం అద్భుతం (పిక్చర్స్)

హైదరాబాద్/వరంగల్: భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కైవేల నిర్మాణానికి కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. కన్సల్టెంట్లను కూడా నియమించే యోచనలో ఉంది. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం-ఎస్సార్డీపీ) కింద చేపడుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి కెటి రామారావు శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్సార్డీపీ అమలుకు కన్సల్టెంట్లను నియమించుకోవాలని, పనుల సమన్వయానికి, పరిశీలనకు ప్రత్యేకంగా ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయసాధనకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, ట్రాన్స్‌కో, వాటర్‌బోర్డు, అటవీశాఖ విభాగాల అధికారులు ప్రతివారం సమావేశం కావాలన్నారు.

ఈ సమావేశానికి తాను కూడా హాజరవుతానని చెప్పారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి చెప్పారు. తాము సైతం వినూత్నమైన ఫైనాన్సింగ్ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తయితే జిహెచ్‌ఎంసి ఆదాయవనరులు పెరుగుతాయన్నారు.

దుర్గం చెరువు

దుర్గం చెరువు

దుర్గం చెరువు మణిహారంగా మారుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం ఆయన జిహెచ్ఎంసి నగర మేయర్ బొంతు రామ్మోహన్, టూరిజం, ట్రాఫిక్ అధికారులతో కలిసి చెరువుపై నూతనంగా బ్రిడ్జ్ నిర్మించే ప్రదేశాలను సందర్శించారు.

దుర్గం చెరువు

దుర్గం చెరువు

జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు 184 కోట్ల రూపాయల ఖర్చుతో రెండు లైన్ల బ్రిడ్జ్‌ను జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ఐఐసీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు 20 కోట్లతో చెరువులోని గుర్రపుడెక్కను తొలగించి, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు సైకిల్ తిప్పడానికి బైస్కిల్ ట్రాక్‌లను నిర్మించనున్నారు.

దుర్గం చెరువు

దుర్గం చెరువు

చెరువుపై నుంచి ఒక కి.మీ. మేర పొడవుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందని కెటిఆర్ తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లకు వెళ్లే ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలను తగ్గటంతోపాటు, నగరవాసులకు మరో అద్భుత పర్యాటక కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు.

దుర్గం చెరువు

దుర్గం చెరువు

ఈ బ్రిడ్జ్‌పై మొత్తం నాలుగు లైన్లు ఉంటాయని, వాటితో పాటు ఫుట్‌పాత్, బైస్కిల్ రైడ్ మార్గాలు కూడా ఉంటాయని తెలిపారు. దుర్గంచెరువు అభివృద్ధికి అదనంగా మరో15 నుంచి 20 కోట్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కెటిఆర్ తెలిపారు.

దుర్గం చెరువు

దుర్గం చెరువు

చెరువు ప్రాంతాన్ని సుందర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని కేటీఆర్ చెప్పారు. కాగా, దుర్గంచెరువు ప్రాంతంలో చేపడుతున్న బ్రిడ్జ్ పనులతో ప్రకృతి, పచ్చదనానికి ఎలాంటి హాని జరగదని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. దుర్గంచెరువు ప్రాంతంలోని ప్రకృతి అందచందాలకు ఎలాంటి నష్టం జరగనివ్వకుండా పనులు పూర్తి చేస్తామన్నారు.

 లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

రాష్ట్రంలో అణువణువూ తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ చెప్పారు.

లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నిర్మించిన ఉడెన్ కాటేజీలను శనివారం టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి ప్రారంభించారు.

 లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రకృతి సిద్ధమైన అందాలతో అలరారుతున్న లక్నవరం సరస్సును గత పాలకులు పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో పర్యాటకశాఖ నేతృత్వంలో అభివృద్ధి చేశామన్నారు.

లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

కేంద్రం స్వదేశీ దర్శన్ కింద అందిస్తున్న రూ.92.11 కోట్ల తో ములుగు, లక్నవరం, దామెరవాయి, మల్లూరు, బొగత జలపాతం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.

లక్నవరం చెరువు

లక్నవరం చెరువు


ప్రస్తుతం లక్నవరం వద్ద రూ.33 లక్షలతో రెండు ఉడెన్ కాటేజీలు, అద్దాల కాటేజీలు నిర్మించామని, సరస్సును, దీవులను విడతల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు.

 లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

లక్నవరంలో అన్ని రోజుల్లో నీరుండేలా దేవాదుల నీటిని మళ్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చందూలాల్ చెప్పారు.

లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ ఎండీ క్రిస్టినా జడ్‌చోంగ్తూ, కలెక్టర్ వాకాటి కరుణ, ఐటీడీఏ పీవో, ఆర్డీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

 లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

రాష్ట్రంలో అణువణువూ తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ చెప్పారు.

 లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నిర్మించిన ఉడెన్ కాటేజీలను శనివారం టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి ప్రారంభించారు.

లక్నవరం చెరువు

లక్నవరం చెరువు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రకృతి సిద్ధమైన అందాలతో అలరారుతున్న లక్నవరం సరస్సును గత పాలకులు పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో పర్యాటకశాఖ నేతృత్వంలో అభివృద్ధి చేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+