ఇక నుంచి వీరికీ ఉచిత విద్యుత్ అమలు, ప్రభుత్వం ప్రకటన - దరఖాస్తు ఇలా..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో తీపి కబురు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేస్తోంది. కాగా, ఈ పథకం ఇప్పుడు మరింత మందికి విస్తరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా స్పష్టత ఇచ్చింది. అర్హత కలిగిన వారికి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. విధి విధానాలను వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకాన్ని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కింద ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పేదలకు అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం క్రింద 52.82 లక్షల మంది లబ్ది పొందుతుండగా.. ఇప్పటివరకు రూ.3,593 కోట్లు వీరి విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 200 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించేవారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. అంతకుమించి వాడితే మాత్రం ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేసింది.

dy-cm-bhatti-key-announcements-over-gruhajyothi-scheme-in-assembly-details-here

కాగా, ప్రభుత్వం ప్రతీ బీపీఎల్ కుటుంబానికి ఈ పథకం అమలు చేస్తుందని వెల్లడించారు. ఇందు కోసం రేషన్ కార్డు తప్పనిసరి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. కొత్తగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు పొందివారు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. 200 యూనిట్లకు మంచి 10 నుంచి 15 యూనిట్ల ఎక్కువగా వాడితే మొత్తం యూనిట్లకు బిల్లులు వసూలు చేస్తున్నారని, వీరిని గృహజ్యోతి స్కీమ్ నుంచి తొలగిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. వారికి కూడా పథకం వర్తింపచేయాలని కోరారు. కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+