అలిగిన ఈటల రాజేందర్‌కు కీలక పదవి..!!
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టింది బీజేపీ అధిష్ఠానం. రెండు చోట్లా పార్టీ అధ్యక్షులను తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- ఏపీలో పార్టీ పగ్గాలను కేంద్ర మాజీమంత్రి డీ పురంధేశ్వరికి అప్పగించింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం, ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక పోరును దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం- సంస్థాగత మార్పులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాబోతోన్నారు.

అదే సమయంలో తెలంగాణలో.. మాజీ మంత్రి, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌కు కీలక పదవిని అప్పజెప్పింది బీజేపీ అధిష్ఠానం. పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. జాతీయ స్థాయిలో పని చేసే కమిటీ ఇది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహన కమిటీ బాధ్యతలను ఈటల పర్యవేక్షిస్తారు.
ఈటల రాజేందర్ ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆయనను తప్పించాలంటూ డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ను కొనసాగించాల్సిన పరిస్థితే ఏర్పడితే- తాను గుడ్ బై చెబుతాననీ తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి. కాంగ్రెస్‌లో చేరొచ్చంటూ ప్రచారం జరిగిన వేళ- ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది బీజేపీ హైకమాండ్.
ఇక- ఈ మార్పులు చేర్పుల వ్యవహారంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇచ్చింది. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా అపాయింట్ చేసింది. కొద్దిరోజుల కిందటే కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారాయన.












Click it and Unblock the Notifications