జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు.. షెడ్యూల్ విడుదల..!
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21 కాగా.. నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ 22గా ఉంది. విత్ డ్రా చేసుకోవడానికి ఈ నెల 24 చివరి తేదీగా నిర్ణయించింది. తాజాగా బిహార్ ఎన్నికల వివరాలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను సైతం తాజాగా విడుదల చేసింది.
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21 గా ఉంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 వ తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 వరకు ఉందని ఈసీ షెడ్యూల్ లో పేర్కొంది.
తాజాగా రోజు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసన సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్స్ ను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహించింది. సర్వే ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇంచార్జ్ మంత్రులు. దిల్లీలో సోమవారం జరగనున్న స్క్రీనింగ్ కమిటీకి ఈ సమాచారం పంపనుంది పీసీసీ. నవీన్ యాదవ్, బొంతు రాంమోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కారు గుర్తుపై మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇక బీజేపీ నుంచి నలుగురు ఆశావహులు దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ ఉన్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications