పూరీ జగన్నాథ్‌ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ: ఈ కేసుతో సంబంధం లేదంటూ బండ్ల గణేష్
హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సుమారు 10 గంటలపాటు విచారించింది. ఈ విచారణలు పలు కోణాల్లో పూరీకి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టింది. మొదటగా పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి మంగళవారం ఉదయం వెళ్లారు. ఆయనతోపాటు తన చార్టెడ్ అకౌంటెంట్(పీఏ) శ్రీధర్‌ని కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై విచారించారు.

ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి 2017 వరకు జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
బ్యాంకు లావాదేవీలతోపాటు ఇతర ఆర్థిక విషయాలను ఈడీ అధికారులు అడిగినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కాగా,
2017లో నమోదైన డ్రగ్స్ కేసు ఆధారంగా చేపట్టిన సినీ ప్రముఖుల విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది.
పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారిస్తున్న సమయంలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి రావడం గమనార్హం. అయితే, తాను పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకు వచ్చానని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూరి జగన్నాథ్ తిరిగి రావడం ఆలస్యం కావడంతోనే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అమ్మతోడు తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని గణేష్ చెప్పారు.
కాగా, డ్రగ్స్ సరఫరాదారులకు, కొంతమంది సినీ సెలబ్రిటీలకు మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జులై 2017లో మత్తు మందుల సరఫరాదారు కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్లో కొంత మంది సినీ రంగానికి చెందిన వారి ఫోన్ నెంబర్లు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దాని ఆధారంగానే ఎక్సైజ్ అధికారులు 12 మంది సినీరంగానికి చెందిన వారిని పిలిచి ప్రశ్నించారు. దీంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ 12 మందిలో పూరీ జగన్నాథ్‌తోపాటు ప్రముఖ నటులు రవితేజ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్, తదితరులు ఉన్నారు.
Recommended Video
ఇది ఇలావుండగా, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ డ్రగ్స్ కేసులో విచారణ సాగుతోంది. అక్కడి పలువురు సినీనటులను అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా నగరాలకు ఈ డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications