ప్రధాని మోడీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ: పలుచోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్స్‌ను తప్పు పట్టింది. ఊహించినట్టే- మోడీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. హైదరాబాద్ సహా పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అటు పార్లమెంట్ సమావేశాల్లోనూ దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయనుంది.

కాంగ్రెస్ డీఎన్ఏలోనే..
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ది విభజించు.. పాలించు అనే విధానమని, ఇది వారి డీఎన్‌ఏలోనే ఉందని మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోందని మండిపడ్డారు. అంబానీ, అదానీలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని, ఇది వామపక్ష వైఖరిని ప్రస్ఫూటింపజేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై..
ఈ సందర్భంగా మోడీ తెలంగాణ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణను ఇచ్చినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలే దీనికి కారణమని చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతున్నారని, అయినా ఆ పార్టీ నేతల ఈగో మాత్రం తగ్గట్లేదని ప్రదాని మోడీ ఎద్దేవా చేశారు. ఇంకో వంద సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో రాలేదని తేల్చి చెప్పారు

మోడీపై రేవంత్ రెడ్డి ఫైర్..
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లో్క్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఘాటుగా విమర్శించారు. తెలంగాణ పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిననే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. తాను ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తోన్న ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని రేవంత్ రెడ్డి అన్నారు.

దిష్టిబొమ్మల దగ్ధంతో..
దీని తరువాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వ్యాఫ్తంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదురుగా మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినదించారు.

రాజకీయ లబ్ది కోసమేనంటూ..
రాష్ట్ర విభజన తరువాత తలెత్తిన సమస్యలను ప్రధాని మోడీ ఏనాడూ పరిష్కరించడానికి ఆసక్తి చూపలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కోట్లాదిమంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ లేవనెత్తారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగీకరించిన తరువాతే విభజన చోటుచేసుకుందని అన్నారు.

ప్రజలను గౌరవించాం..
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి..కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప- ఓట్ల కోసమో.. రాజకీయ ప్రయోజనాల కోసమో కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ పార్టీ నెరవేర్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చోటు చేసుకుని ఏడు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ.. సమస్యలను పరిష్కరించడానికి మోడీ ఎందుకు సిద్ధంగా లేరని నిలదీశా












Click it and Unblock the Notifications