హనీ ట్రాప్‌లో 81 ఏళ్ల వృద్ధుడు..ఈ వయస్సులో అవసరమా తాత..!
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు సృష్టించి, అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో జరిగిన ఒక సంఘటన సైబర్ మోసాల తీవ్రతను మరోసారి గుర్తు చేసింది.
జూన్ నెలలో 81 ఏళ్ల వృద్ధుడు ఒకరు 'మాయా రాజ్‌పుత్' అనే పేరుతో వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ట్రాప్‌లో పడ్డారు. పరిచయం పెంచుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఆ వృద్ధుడి నుంచి విడతల వారీగా ఏకంగా రూ. 7.11 లక్షలు కాజేశారు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు మొత్తం అయిపోయాక గానీ తాను మోసపోయానని ఆ వృద్ధుడికి అర్థం కాలేదు.

వెంటనే ఆయన అమీర్‌పేట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజంలో వృద్ధులు, అమాయకులు సైబర్ నేరాలకు ఎంత సులభంగా బలవుతున్నారో స్పష్టం చేస్తోంది. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ హనీ ట్రాప్ వెనుక ఒక పకడ్బందీ ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications