ఎన్నికల కోడ్: హైదరాబాద్‌లో కిలోల కొద్ది బంగారం, భారీగా నగదు సీజ్, ఓటర్లకు పంచే కుక్కర్లు
హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడటంతో పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి రసీదు లేనివాటిని స్వాధీనం చేసుకుని.. కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

మరోవైపు, నిజాం కాలేజీ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్ చేసినట్లు సమాచారం. ఫిలింగనర్ పరిదిలోని షేక్‌పేట్ నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఎలాంటి రసీదు లేకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన రూ. 4 లక్షలను సీజ్ చేశారు. రాయికల్ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ. 11.5 లక్షలు పట్టుబట్టాయి. మరోవైపు, శేరిలింగంపల్లి గోపన్ పల్లి తాండాలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కుక్కర్లు పంచుతున్న రాములు నాయక్, నర్సింహా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కర్లపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత రఘునాథ్ స్టిక్కర్లు ఉండటం గమనార్హం.
ఇది ఇలావుండగా, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 12.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని మూడు చోట్ల నగదును పట్టుకున్నారు. వైరా సమీపంలో తరలిస్తున్న రూ. 5 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. కాగా, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళితే అందుకు సంబంధించిన సరైన పత్రాలు ఉండాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం ఆభరణాలు తీసుకెళ్లినా పత్రాలు ఉండాలని అంటున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications