రేవంత్ సర్కారుకు ఈసీ గుడ్‌న్యూస్
ఎన్నికల సంఘం నుంచి తెలంగాణలోని రేవంత్ సర్కారుకు శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం రోజున గన్‌పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించనున్నారు.
కాగా, రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద రోడ్డుకు రెండు వైపులా రంగు రంగుల జెండాలతో అలంకరించాలని జీహెచ్ఎంసీకి సీఎస్ తెలిపారు. సభా ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, షామియానాలు, బారికేడింగ్, భద్రత, పార్కింగ్, ఎలాంటి ఆటంకం లేకుండా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పండగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక సీఎస్ అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈసీ అనుమతి కోసం ఎదురు చూసింది. అయితే ఈసీ అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న ప్రణాళికలను పక్కాగా వర్కవుట్ చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని, రాష్ట్ర అధికార గీతంగా జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. "జయ జయ హే తెలంగాణ" గీతాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ రచించారు. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించనున్నారు. ఫిబ్రవరి 4న ఈ గీతాన్ని కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది.
కాగా, రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం. మరోవైపు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించనున్నారు. సన్నానం చేయాల్సిన ఉద్యమకారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications