ఉద్విగ్న క్షణాలు: హాజీపూర్ కిల్లర్‌కు ఉరి: రాచకొండ పోలీస్ కమిషనర్‌ను హీరోగా..!
నల్లగొండ: ఉద్వేగ భరిత వాతావరణం.. ఉద్విగ్న క్షణాలు. ఇన్ని రోజుల తమ నిరీక్షణ ఫలించిందనే ఆనందం..తమకు న్యాయం జరిగిందనే సంతోషం.. ఆ కుటుంబాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. తమకు కడుపుకోతను మిగిల్చిన నరరూప రాక్షసుడికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించగానే.. బాధితుల కుటుంబీకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. వీలైనంత వేగంగా ఆ కామాంధుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని వేడుకున్నారు.

హాజీపూర్ వరుస హత్యల కేసులో..
రెండు తెలుగు రాష్ట్రాలను నివ్వెర పోయేలా చేసిన హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషిగా తేలిన మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్లగొండలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ముగ్గురు బాలికలపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 42 రోజుల్లోనే ఈ కేసు విచారణ ముగియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 42 రోజుల్లో 101 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

స్వల్ప కాలంలోనే..
ఈ సీరియల్ హత్య కేసుల్లో రాచకొండ పోలీసులు అద్భుత పనితీరును కనపరిచారు. స్వల్ప కాలంలోనే దీన్ని ఛేదించారు. అసలు హంతకుడిని అరెస్టు చేయగలిగారు. న్యాయస్థానంలో నిల్చోబెట్టగలిగారు. ఈ క్రమంలో- పోలీసుల పనితీరు, దర్యాప్తులో వారు కొనసాగించిన వేగాన్ని న్యాయస్థానం కూడా ప్రశంసించింది. ప్రభుత్వం తరఫున ఈ కేసును విచారించిన న్యాయవాదులు రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు.

మహేష్ భగవత్‌ను హీరోగా..
ఇక బాధితుల కుటుంబ సభ్యులు రాచకొండ పోలీసులకు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలను తెలిపారు. నల్లగొండ న్యాయస్థానానికి వచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఆయనను హీరోగా అభివర్ణించారు. మొదటిసారిగా కేసును నమోదు చేసినప్పటి నుంచీ చివరికి.. కామాంధుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించేంత వరకూ మహేష్ భగవత్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు.

స్వీట్లను పంచుకున్న కుటుంబ సభ్యులు..
మర్రి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించగానే బాధితుల కుటుంబీకులు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. స్వీట్లు పంచుకున్నారు. తమ బిడ్డల ఆత్మకు శాంతి లభించిందని కన్నీరు మున్నీరు అయ్యారు. శ్రీనివాస్ రెడ్డిని వీలైనంత వేగంగా ఉరికంబం ఎక్కించేలా చూడాలని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. ఈ కేసులో తీర్పును వినడానికి బాధితుల కుటుంబ సభ్యులందరూ న్యాయస్థానానికి చేరుకున్నారు. తీర్పు వెలువడిన వెంటనే హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications