అమెరికాలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల ఉత్సాహం.!పెట్టుబడులకు ఆసక్తి.!కేటీఆర్ కు నీరాజనాలు.!

హైదరాబాద్ : తెలంగాణ ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాలో కేటీఆర్ కాలు పెట్టిన ప్రతి రాష్ట్రంలో అక్కడ స్థిరపడ్డ ప్రముఖ పారిశ్రామిక వేత్తలనుండి ఊహించని ప్రతిస్పందన కనిపించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వారు చూపిస్తున్న ఆసక్తిని చూసి ఓ దశలో కేటీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. న్యూ యార్క్, న్యూ జెర్సీ కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రముఖ ఔషద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సహం చూపించడాన్ని చూసి కేటీఆర్ హర్షాన్ని వ్యక్తం చేసారు.

అమెరికా తెలంగాణ పారిశ్రామికవేత్తల ఆసక్తి..

అమెరికా తెలంగాణ పారిశ్రామికవేత్తల ఆసక్తి..

హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న పలు కంపెనీల నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని మంత్రి కేటీఆర్ స్వయంగా తెలిపారు. పెట్టుబుడులతో వచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేసారు. ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు మరింత సమర్ధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటించిన ప్రతి రాష్ట్రంలో అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అమెరికాలో కేటీఆర్ కు నీరాజనాలు..

అమెరికాలో తెలంగాణ ప్రజల ఐకమత్యమే కాకుండా తెలంగాణ పారిశ్రామిక వేత్తల ఐకమత్యం మరోసారి నిరూపితమైంది. మాతృభూమికోసం ఏం చేసినా రుణం తీర్చుకోలేమనే అభిప్రాయాన్ని తెలంగాణకు సంబందించిన అమెరికా పారిశ్రామిక వేత్తలు నిరూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పరిస్థితి వేరని, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పరిస్ధితులు వేరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక ఆసక్తిచూపిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలు కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడంలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ సాధనలో భాగస్వామ్యం లేదు..

అమెరికాలో సెటిల్ ఐన తెలంగాణ పారిశ్రామిక వేత్తల్లో ఏకాభిప్రాయం తీసుకురావడంలో అటు సీఎం చంద్రశేఖర్ రావు తో పాటు, ఐటి శాఖా మంత్రి కేటీఆర్ విజయం సాధించినట్టు స్పష్టమవుతోంది. అమెరికా పర్యటన సందర్బంగా అక్కడ పారిశ్రామిక వేత్తలు కేటీఆర్ పట్ల చూపించిన ఉత్సాహాన్ని చూస్తే అర్థం అవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అంతగా భాగస్వామ్యం లేకపోయినప్పటికీ పెట్టుబడుల రూపంలో ఆ లోటును పూడ్చుకుంటామనే భావనలో తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది.

 కేటీఆర్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్..

కేటీఆర్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్..

సప్త సముద్రాలు దాటినా తెలంగాణ మీద ఉన్న మమకారాన్ని మాత్రం వదుకోలేదని అమెరికాలో సెటిల్ ఐన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు మరోసారి నిరూపించారని కేటీఆర్ స్వయంగా అభినందించారు. తాను పర్యటించిన ఆరు రాష్ట్రల్లో తెలంగాణ ప్రజలు చూపించిన ఆధరణ ఎన్నటికి మర్చిపోలేనని తెలిపారు. ఇక పెట్టుబడుల అంశానికి వస్తే బంగాలు తెలంగాణ సాధన కోసం వినూత్నంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ద కనబరచడం ఆశ్చర్యానికి గురిచేసినట్టు కేటీఆర్ స్పష్టం చేసారు. మంత్రి కేటీఆర్‌ వెంట పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, రాష్ట్ర లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+