ఎర్రబెల్లి పార్టీ మార్పు - తేల్చేసారు..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ లోని సీనియర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. వారికి మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం కొనసాగుతోంది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక..మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీ మార్పు వ్యవహారం పైన ఆయనే స్పష్టత ఇచ్చారు. పార్టీ మార్పు పై తేల్చేసారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఎలా చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేసారు. ఇవి బోగస్ మాటలు కాదా అని నిలదీసారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు లేదన్నారు. రైతులకు ఎరువులు అందటం లేదని చెప్పారు. నీళ్లు, కరెంట్ లేదని..మళ్లీ పాత రోజులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మఖ్యమంత్రి రేవంత్ రైతులకు వ్యతిరేకం గా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ రైతుల కోసం ఏం చేసారో..రేవంత్, కాంగ్రెస్ నేతలు గుర్తించాలని సూచించారు.

Eraabelli Dayakar Rao reacts over his party change speculations see deets

ఇక, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారటం లేదని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయడమే తన లక్ష్యమని దయాకర్ రావు తేల్చి చెప్పారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఆరు నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నామని దయాకర్ రావు చెప్పుకొచ్చారు. రైతులు ఆగం అవుతున్నారని..కుప్ప కూలిపోతున్నారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+