పొంగులేటి చెప్పింది నిజమే, అదే జరిగేది - ఎర్రబెల్లి..!!
మాజీ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మంత్రి పొంగులేటి కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయని చెప్పుకొచ్చారు. అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే పొంగులేటి వ్యాఖ్యల పైన కేటీఆర్ స్పందించారు. దేని కైనా సిద్దమని స్పష్టం చేసారు. ఇదే సమయంలో పొంగులేటి వ్యాఖ్యల పైన ఎర్రబెల్లి స్పందన ఆసక్తి కరంగా మారింది.
మంత్రి పొంగులేటి దీపావళికి ముందే రాష్ట్రంలో స్కామ్‌ల బాంబులు పేలబోతున్నాయని వ్యాఖ్యానించారు. వీటి పైన బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముమ్మాటికి దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని పొంగులేటి చెప్పింది నిజమేనని అన్నారు. అయితే, అవి బీఆర్ఎస్ నేతల పైన కాదని.. కాంగ్రెస్ పార్టీలో అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే బాంబులు పేలుతాయి.. వాళ్ల కుర్చీలు కదులుతాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ముప్పును పొంగులేటి ముందే పసిగట్టారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు గుర్తింపులేదని వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కుతున్నారని ఎద్దేవా చేసారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అదే విధంగా సీఎం రేవంత్ కు పార్టీ హైకమాండ్ అప్పాయింట్ మెంట్ ఇవ్వటం లేదని వ్యాఖ్యానించారు. ఎలాంటి విచారణ ప్రభుత్వం చేసినా అభ్యంతరం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని దయాకర్ రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications