రేవంత్ రెడ్డిపై కెసిఆర్, చంద్రబాబు రాజీ ఎఫెక్ట్?: సీనియర్ల ఎత్తిపొడుపులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసుకున్న రాజీ ప్రభావం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పడినట్లే కనిపిస్తోంది. పార్టీ తెలంగాణ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని ఎత్తిపొడిచారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ఈ కేసుతో పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందని వారు రేవంత్ రెడ్డిని ఎత్తిపొడిచారు. ఇప్పటికైనా ఆచితూచి వ్యవహారించాలని వారు చెప్పారు.
పార్టీలో సీనియర్లను గౌరవించడం మంచిదని కూడా అన్నారు. పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లితో రేవంత్ రెడ్డి తగాదా పడడాన్ని వారు అవకాశంగా తీసుకున్నారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం తెలంగాణ టిడిపి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ అయితే సీనియర్ నేతలు ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచారు.

అంతేకాకుండా, రేవంత్ రెడ్డి దూకుడుని తగ్గించే ప్రయత్నం చేశారు. దూకుడు తగ్గించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డికి సీనియర్లు సూచించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి నువ్వేంత అంటే నువ్వెంత అని సవాల్ చేసుకుంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్లు తెలిసింది. పరస్పరం తీవ్రపదజాలంతో ఎర్రబెల్లి, రేవంత్ తిట్టుకున్నట్లు సమాచారం.
పార్టీ సమవేశాలకు ఐటెం సాంగ్‌లా వచ్చి వెళ్తుంటావు అని రేవంత్‌ను ఎర్రబెల్లి విమర్శించినట్లు తెలిసింది. వ్యక్తిగత ప్రతిష్టకు వెళ్లవద్దని కూడా సీనియర్లు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications