వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరి లగ్గం చేస్తాడు.!కేసీఆర్ ఓ మామ, ఓ తండ్రి.!సీఎంను పొగడ్తలతో ముంచిన ఎర్రబెల్లి.!

|
Google Oneindia TeluguNews

వరంగల్/హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో మమేకమయ్యారు. కల్లాల్లో పనిచేసుకుంటున్న రైతులతో ముచ్చటించారు. రైతులను పేరు పేరునా పలకరిస్తూ, ఎంత పొలం చేసినవు? ఎంత పండింది? గిట్టుబాటు ఉందా? అంటూ అరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా, వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, తేమ, తాలు లేకుండా జగృత్త పడితే, మంచి ధర వస్తుంది అని రైతులకు ధైర్యం చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా అర్హులకు వివిధ పథకాల కింద మంజూరైన చెక్కులను అందజేసారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

 రైతులతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి.. ప్రత్యామ్నయ పంటలపై దృష్టి పెట్టాలని సూచన

రైతులతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి.. ప్రత్యామ్నయ పంటలపై దృష్టి పెట్టాలని సూచన

ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాలకు చెందిన 102 మంది లబ్ధిదారులకు కోటి, 2 లక్షల, 11 వేల, 832 రూపాయల విలువైన చెక్కులను అందచేసిన మంత్రి
జనగామ జిల్లా పాలకుర్తి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

 సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ టాప్.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన ఎర్రబెల్లి

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ టాప్.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన ఎర్రబెల్లి

దేశంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నది కూడా తెలంగాణలోనే అన్నారు. ప్రజల సంక్షేమం లక్ష్యంగా సీఎం చంద్రవేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తున్నారని, అందులో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ ఒక పథకమని, ఓ పేదింటికి తండ్రిలా, మేనమామ లా చంద్రశేఖర్ రావు పెండ్లిల్లు చేస్తున్నారని, ప్రజలు అడిగిన, అడగని, మేనిఫెస్టో లో చెప్పిన, చెప్పని పథకాలను ప్రజల అవసరాల దృష్ట్యా అమలు చేస్తున్నది కూడా సీఎం చంద్రశేఖర్ రావే అని మంత్రి స్పష్టం చేసారు.

 దళిత బంధు అద్బుతమైన పథకం.. దేశంలో ఎక్కడా లేదన్న మంత్రి.

దళిత బంధు అద్బుతమైన పథకం.. దేశంలో ఎక్కడా లేదన్న మంత్రి.

దళిత బంధు దళితుల కోసం చేపట్టిన అద్భుత పథకమని మంత్రి దయాకర్ రావు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే పరమావధి గా సీఎం పని చేస్తున్నారని మంత్రి అన్నారు. ఇక రైతాంగం కోసం సీఎం చంద్రశేఖర్ రావు రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలతో పాటు కరోనా కష్ట కాలంలో రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న మనసున్న మారాజని చంద్రశేకర్ రావును ప్రశంసించారుమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో రైతులను దగా చేస్తున్నదని విమర్శించారు.

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు!! || Oneindia Telugu
రాష్ట్రం ధాన్యం కొంటుంది.. కేంద్రమే కిరికిరి పెడుతుందన్న ఎర్రబెల్లి దయాకర రావు

రాష్ట్రం ధాన్యం కొంటుంది.. కేంద్రమే కిరికిరి పెడుతుందన్న ఎర్రబెల్లి దయాకర రావు

కేంద్ర ప్రభుత్వం కనీసం ధాన్యం కొంటుందా లేదా? బియ్యం తీసుకుంటుందా లేదా? యాసంగి లక్ష్యాలు చెప్పమన్నా చెప్పడం లేదని, ఇంత చేతకాని, స్పష్టత లేని కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రమం వ్యక్తం చేసారు. ప్రజలు అన్ని విషయాలను గ్రహించాలని, సమయానుకూలంగా స్పందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

English summary
Panchayati Raj Minister Errabelli Dayakar Rao met the farmers in the joint Warangal district. Captivated with farmers working in the quarries.Dayakar Rao handed over the cheques sanctioned under various schemes to the beneficiaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X