మూడేళ్లు ఏం చేసారు సీఎం కేసీఆర్: కుంభకర్ణుడిలా అంటూ ఈటల రాజేందర్ విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అనేక సమస్యలున్నా.. ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

మూడేళ్లుగా ఫాంహౌస్, ప్రగతిభవన్‌లోనే కేసీఆర్: ఈటల ఫైర్
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జీవో 124, 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమితమైన సీఎం కేసీఆర్.. ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మండిపడ్డారు. ఇప్పుడెమో పరుగులు పెడుతున్నారని ఈటల అన్నారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని, వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. చిక్కుముడులు, అపోహలు, అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరపాలి. అప్పటివరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.

కేసీఆర్ కుంభకర్ణుడిలా అంటూ ఈటల మండిపాటు
నేను రాజును నాకే అన్నీ తెలుసు.. నేను చెప్పిందే చేయాలి అని కేసీఆర్ హుకుం జారీ చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. మూడు సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వీరి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఉద్యమంలో చెప్పి సీఎం అయ్యాక మర్చిపోయారా? అని సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఎస్సీలను ఓటు బ్యాంకుగా టీఆర్ఎస్ చూస్తోంది: బండి సంజయ్
మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ విధానాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్సీలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూడటంలేదన్నారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రజలు టీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. మిషన్ 19 తో ముందుకు వెళ్తామన్నారు బండి సంజయ్. సోమాజిగూడ కత్రియ హోటల్ లో జరుగుతున్న ఎస్సీ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో నేతలు మాట్లాడారు. దళితుల ఓటు బ్యాంకు తమకే అని కాంగ్రెస్ భ్రమ పడుతుందన్నారు. లోక్ సభలో ఉన్న దళిత నియోజకవర్గాల్లో బీజేపీ 46 గెల్చుకుంటే... కాంగ్రెస్ 5 మాత్రమె గెలిచిందన్నారు. దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దళిత పథకాలు తెస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. డబ్బులతో దళితుల ఓట్లు కొనోచ్చులే అనుకున్న కేసీఆర్‌కు...హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే..ఇప్పటికే ఆర్థికంగా బలోపేతం అయ్యే వారన్నారు. ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications