మరో ఎన్నికకు సిద్ధమంటున్న ఈటల రాజేందర్
వరంగల్: పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామమన్నారు. పోటీ చేయాలా వద్దా, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.వ్యక్తుల పట్ల పార్టీ దగ్గర అపారమైన సమాచారం ఉంటుందన్నారు.
2021 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారని ఈటల ఆరోపించారు. కేసీఆర్ ఎమ్మెల్యే హక్కులను హరించారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్నారు. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు.

నాడు కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకాలు చేసేది తానైతే.. పంపిణీ చేసేది బీఆర్ఎస్ వాళ్లని చెప్పుకొచ్చారు. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అప్పటి ప్రభుత్వం పగబట్టిందన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఈటల రాజేందర్ విమర్శించారు.
కాళ్వేశరం ప్రాజెక్టులో భారీ అవినీతి: రఘునందన్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. మోడీకి లేఖ రాస్తే సీబీఐతో విచారణ జరిపించే విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో సమీక్ష నిర్వహిస్తే అసలు దోషులు బయటపడతారని అన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ చేసిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై 2008 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సమీక్ష జరిగింది. నాడు రూ.17,800 కోట్లతో 160 టీఎంసీలతో ప్రాజెక్టుకు ప్రతిపాదన జరిగింది. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేశారు. దీంతో పాటు 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేశారు. మరో 20 టీఎంసీలు పెంచి రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల కోసం గుత్తేదారులకు రూ.11 వేల కోట్లు చెల్లింపులు జరిగాయని రఘునందన్ రావు వివరించారు.
అయితే, 2016లో కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు డిజైన్ మార్చారని రఘునందన్ రావు పేర్కొన్నారు. రూ.63 వేల కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్‌కు ప్రతిపాదనలు పెట్టారని ఆరోపించారు. తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.05 కోట్లకు పెంచిందని రఘనందన్ రావు పేర్కొన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications