కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నారు, రాజకీయాలను దిగజార్చారు: ఈటల రాజేందర్ విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, ఇందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన కారకులయ్యారంటూ ఆరోపించారు. గురువారం గురువారం గౌలిగూడలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామస్వామి విగ్రహాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామస్వామి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అప్పట్లో మాజీ మంత్రి రామస్వామి బుల్లెట్ పైనే అసెంబ్లీకి వచ్చేటోడని ఆయన గుర్తు చేసుకున్నారు. రామస్వామి గొప్ప మహనీయుడని, ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. రామస్వామి, నాగిని నరసింహారెడ్డి బుల్లెట్ పైన వచ్చే వాళ్లు అసెంబ్లీకి వచ్చేటోళ్లని, మరికొందరైతే ఆటోలలో వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ గుమ్మడి నర్సయ్య పూరి ఇంట్లో ఉంటాడని వివరించారు. అయితే నీతి నిజాయితీ విలువలతో కూడుకున్న రాజకీయ నేతలను కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నడని ఈటల రాజేందర్ ఆరోపించారు.

 BJP MLA Etala Rajender slams CM KCR, praises Ramaswami.

ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, దేశంలోనే ఇంత డబ్బు ఖర్చు పెట్టిన ఎలక్షన్ ఎక్కడా లేదని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యానికి హుజురాబాద్ ప్రజలు లొంగకుండా కేసీఆర్ చెంప ఛెళ్లు మనిపించారని ఈటల అన్నారు. హైదరాబాద్ ప్రజలు ధర్మం, న్యాయం, వైపు ఉండి నీతి నిజాయితీ రాజకీయాలు చేసే నేతలను ఎన్నుకోవాలని ఆయన కోరారు.

రామస్వామి సేవలు కొనియాడిన వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి రామస్వామి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం గౌలిగూడలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకలకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌలిగూడలో రామస్వామి విగ్రహాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయచే ఆవిష్కరింప చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రామస్వామి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు ఎనలేని సేవలందించారని, తన తండ్రి వెంకటస్వామి సివిల్ సప్లై మంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై నిరంతరం కలుస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. నిరంతరం జనంలో ఉండే రామస్వామి ఎప్పుడు బుల్లెట్ బండి పైన తిరిగే వారని, ఆ రోజుల్లో గొప్ప రాజకీయ నేత అని వివరించారు.

రామస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

రామస్వామి 85వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అనంతరం రామస్వామి విగ్రహానికి నివాళులు అర్పించారు. రామస్వామి తన నియోజకవర్గంలో ఎవరింట పెండ్లి జరిగినా లేదా చావు లైనా పూర్తి అయిపోయే వరకు ఉండే వ్యక్తి రామస్వామి అని గుర్తు చేసుకున్నారు. నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేశారని, ఆస్తుల కోసం రాజకీయ చేయలేదని కొనియాడారు. హైదరాబాదులో ఎక్కడ అల్లర్లు జరిగినా బుల్లెట్ మీద వెంటనే పోయిన ధైర్యశాలి రామస్వామి అన్నారు. హైదరాబాదులో హిందూ దేవాలయాలు ఏర్పాటు చేయడంలో రామస్వామి గొప్ప పాత్ర పోషించారని, నేటి సమాజo రామస్వామి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన కుమారుడు రాజు రామస్వామిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచనా విధానాలను ముందు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+