సంతోషం ..తగిన మూల్యం చెల్లిస్తారు,కేసీఆర్ తో సహా ఎవ్వరినీ కలవను, శాఖలేని మంత్రిగా ఈటెల.. వాట్ నెక్స్ట్ !!
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ విషయంలో అనుకున్నదే జరిగింది.సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ పై వేటు వేశారు.మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకున్నారు. కెసిఆర్ సిఫార్సు ద్వారా రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో శాఖ లేని మంత్రిగా ఈటెల రాజేందర్ మిగిలిపోయారు. ఇక ఈ తాజా పరిణామాలపై మాట్లాడిన ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఎవర్నీ కలిసేది లేదన్న ఈటెల రాజేందర్
రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని, తాను ఎవరినీ కలవబోయేది లేదని ఈటెల రాజేందర్ తేల్చిచెప్పారు. తన శాఖ నుంచి తనను తొలగించారని తెలిసిందని, చాలా సంతోషం అంటూ స్పందించిన ఈటెల రాజేందర్,అన్ని శాఖలపై ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయని అందుకే ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారంటూ స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడతానని, తన అభిమానులు, అనుచరులతో, తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

పక్కా ప్రణాళికతోనే భూకబ్జా ఆరోపణలు .. ఏం జరిగిందో కూడా తెలియలేదు
పక్కా ప్రణాళికతో ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించిన ఈటెల రాజేందర్ కావాలని తనపై భూకబ్జా ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.అందరూ ఎన్నికలపై దృష్టి సారిస్తే, తాను కరోనా నియంత్రణపై పూర్తి దృష్టిని కేటాయించానని తెలిపిన ఈటెల రాజేందర్ అందుకే తనకు ఏం జరిగిందో కూడా తెలియలేదని పేర్కొన్నారు. తన 25 ఏళ్ల జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పిన ఆయన,మనసులో ఏదో పెట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ప్రజలకు అంతా తెలుసు , ఎవరిపైనా తాను వ్యక్తిగతంగా విమర్శలు చేసేది లేదు
ఎదుటివారి క్యారెక్టర్ ను నాశనం చెయ్యాలనుకోవడం దారుణం అంటూ విమర్శించారు. 25 ఏళ్ల చరిత్రలోమచ్చలేని నాయకుడుగా తాను ఉన్నానని, తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి ప్రజలకు కూడా అర్థమైందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. వాస్తవాలు త్వరలోనే తేలతాయని స్పష్టం చేశారు. ఎవరిపైనా తాను వ్యక్తిగతంగా విమర్శలు చేసేది లేదంటూ పేర్కొన్నారు ఈటెల రాజేందర్.సీఎం కేసీఆర్ తో పాటు తాను ఎవరినీ కలవబోనని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
Recommended Video

భూకబ్జా ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోనే శాఖ నుండి తొలగింపు .. శాఖ లేని మంత్రిగా ఈటెల .. వాట్ నెక్స్ట్ ?
ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోపే సీఎం కేసీఆర్ ఆయనను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా తొలగించడం, వైద్య ఆరోగ్య శాఖలో తన పరిధిలోకి తెచ్చుకోవడం జరిగిపోయాయి.ఈ తాజా పరిణామాలు ఈటెల రాజేందర్ ను శాఖలేని మంత్రిగా చేయగా,ప్రస్తుతం ఈటెల రాజేందర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించిన గల నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈటెల రాజేందర్ భవిష్యత్తు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆసక్తి తెలంగాణ రాజకీయవర్గాలలోనెలకొంది.












Click it and Unblock the Notifications