ప్రతినెలా బీజేపీలోకి చేరికలు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ప్రణాళికలు
హైదరాబాద్: ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికలపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులైన నేపథ్యంలో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశం లేదన్నారు.

ప్రతి నెలా బీజేపీలోకి చేరికలుంటాయి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇతర పార్టీలకు టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదని.. కేసీఆర్‌ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీలో చేరే సరికి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు కూడా తాను బీజేపీలో చేరుతున్న విషయం తెలుసని అన్నారు. బీజేపీలో సరైన కమిటీలో తనకు అవకాశం కల్పించారన్నారు. నెలకు ఒక్క లీడర్‌ను అయినా బీజేపీలోకి తీసుకువస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి కేంద్రమంత్రులు
మరోవైపు, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ పథకాల విజయాల్ని ప్రచారం చేయడంతో పాటు అమలుతీరు తెలుసుకునేందుకు త్వరలోనే కేంద్రమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఇందుకోసం 17 పార్లమెంట్ స్థానాలుండగా... సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా తొలిదశలో 14స్థానాలను ఎంపిక చేసింది. వీటిని నాలుగు క్లస్టర్లుగా విభజించి... ఒక్కో దానికి ఒక్కో కేంద్రమంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఆ క్లస్టర్ పరిధిలో ఇంఛార్జీ మంత్రితో పాటు ఒకరిద్దరు కేంద్రమంత్రులు పర్యటించనున్నారు.

ప్రజల్లోకి కేంద్రంలోని మోడీ పథకాలు.. టీఆర్ఎస్ వైఫల్యాలు
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విడతలవారీగా నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో చర్చించారు. క్లస్టర్లతో పాటు ఒకటి లేదా రెండు పార్లమెంట్ స్థానాలకు ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 3రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర మంత్రులు తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.ఇలా ఒకవైపు కేంద్రప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తూనే... మరోవైపు, టీఆర్ఎస్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతోంది బీజేపీ.

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరంతర కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. త్వరలో బండి సంజయ్ మరోవిడత పాదయాత్ర మొదలు కానుండగా, అదే సమయంలో ముఖ్య నేతలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 10మంది నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఒక్కో నేత పదేసి నియోజకవర్గాల చొప్పున వందస్థానాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.మొదటి సారి ఓటు వేసేవారిని బీజేపీవైపు మళ్లించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు ఆ పార్టీ నేతలు. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూను ప్రతిపాదించింది బీజేపీ. ఈ క్రమంలో గిరిజన తండాల్లో.. గ్రామాల్లో ఆమె చిత్ర పటాలతో ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు సమాచారం.
ఇటీవల హైదరాబాద్ నగరంలో బీజేజీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ భారీ బహిరంగ విజయం కావడంతో ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే పనిలో ఉన్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications