వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ‌లో అంతా ఓకే..!కానీ ఆ మూడు జిల్లాల్లో మోగుతున్న ప్రమాద ఘంటికలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి నుండి తెలంగాణ రాష్ట్రం కోలుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఇది సాద్యమయ్యిందనే చర్చ జరుగుతోంది. చాలా వరకు రెడ్ జోన్లలో పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గి పోవడంతో ఆ జోన్లు కూడా గ్రీన్ జోన్లుగా మారనున్నాయి. మరోపక్క గ్రేటర్ పరిధిలో మాత్రం కరోనా కరతాళనృత్యం చేస్తూనే ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో మాత్రం కరోనా బుసలుకొడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చిన మినిహాయింపులను ఆసరా చేసుకుని ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైన సంచరించడంతో కరోనా కట్టడికి ఆటంకం కలుగుతుంనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 Coronavirus: బెంగళూరులో ఒక్కడి దెబ్బకు 29 మందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ లో 184 మంది ! Coronavirus: బెంగళూరులో ఒక్కడి దెబ్బకు 29 మందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ లో 184 మంది !

 రెడ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి.. కానీ హైదరాబాద్ తో పాటు ఆ రెండు జిల్లాల్లో పురుగుతున్న కేసులు..

రెడ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి.. కానీ హైదరాబాద్ తో పాటు ఆ రెండు జిల్లాల్లో పురుగుతున్న కేసులు..

తెలంగాణ జిల్లాల్లో కరోనా మహమ్మారిని తరిమికొట్టగలిగామని, కాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కరోనా మీద విజయం సాదించలేక పోతున్నామని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భిన్న సంస్కృతుల సమాహారంగా బాసిల్లుతున్న హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజానికానికి సతంత్ర్య భావాలతో పాటు ఆర్థిక స్థోమతకూడా ఎక్కువగానే ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కడైనా సంచరించేదుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సంఘంలో ఆర్థక స్థిరత్వం ఉంటే అనుకోకుండా పలుకుబడి ఉంటుంది. దీంతో లాక్ డౌన్ ఆంక్షలను కాదని స్వేచ్చగా తిరుగుతున్నారు కొంత ప్రజలు.

 హైదరాబాద్ లో కరోనా కరతాళనృత్యం.. కట్టడి దిశాగా అధికారుల కసరత్తు..

హైదరాబాద్ లో కరోనా కరతాళనృత్యం.. కట్టడి దిశాగా అధికారుల కసరత్తు..

పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికి వారికున్న పలుకుబడి ముందు పోలీసుల చర్యలు అంతగా ప్రభావం చూపడంలేదనే చర్చ జరుగుతోంది. దీంతో నగర చుట్టుపక్కల ప్రదేశాల్లో స్వీయ నియంత్రణ లోపంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా కట్టడి చేయగలిగినా, హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల్లో మాత్రం కరోనా కట్టడి చేయలేకపోవడానికి అదే ప్రధాన అడ్డంకిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం వినూత్న వ్యూహం రచించబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా రాష్ట్రంలోని జిల్లాలు గ్రీన్ జోన్లలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

 కొంపముంచిన మినహాయింపులు.. స్వేచ్చగా తిరుగుతున్న ప్రజలు..

కొంపముంచిన మినహాయింపులు.. స్వేచ్చగా తిరుగుతున్న ప్రజలు..

అంతే కాకుండా ప్రస్తుతానికి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉండగా, మరో పద్నాలుగు జిల్లాలు త్వరలోనే గ్రీన్ జోన్‌లో చేరనున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. వచ్చే సోమవారం నాటికి మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాలు గ్రీన్‌ జోన్లోకి మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు జిల్లాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. వీటిలో సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో గత పద్నాలుగు రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శుభసూచకమని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

 మూడు జిల్లాలపై దృష్టి పెట్టనున్న ప్రభుత్వం.. కట్టడి చేయాలంటున్న ప్రభుత్వం...

మూడు జిల్లాలపై దృష్టి పెట్టనున్న ప్రభుత్వం.. కట్టడి చేయాలంటున్న ప్రభుత్వం...

దీంతో ఈ మూడు జిల్లాలు కూడా త్వరలో ఆరెంజ్ జోన్లోకి మారనున్నట్టు అధికారులు దృవీకరిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో కొనసాగనున్నాయని తెలుస్తోంది. ఇక‌పోతే, తెలంగాణలో శుక్ర‌వారం కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసి కరోనాపై పైచేయి సాధించినప్పటికి హైదరాబాద్ తోపాటు మిగిలిన రెండు జిల్లాల్లో ఎందుకు కట్టడి చేయలేకపోతున్నామని అధికారులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నగరంలో ప్రభుత్వం కల్పించిన కొన్ని వెసులుబాట్ల వల్ల స్వీయ నియంత్రణకు భంగం కలిగిందనే చర్చ జరుగుతోంది. ఈ మూడు జిల్లోల్లో కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తే కరోనా నుండి పూర్తిగా విజయం సాదించిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్దానంలో నిలుస్తుందనే చర్చ జరుగుతోంది.

English summary
Red zones in Telangana Reduced Positive Cases are going to be Green Zones. Corona is influencing in Hyderabad, Rangareddy and Medchel districts. In addition to this, there are also expressions of concern that corona building is being hindered by the people partying on the roads in support of the government's exceptions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X