యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు చికిత్స..!!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాల తరువా సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫాం హౌస్ లో ఉంటున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాత్రి బాత్ రూంలో కాలు జారి కేసీఆర్ కిందపడ్డారు. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినట్లుగా ప్రాధమికంగా గుర్తించారు. దీంతో చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ ఫాం హౌస్ లోనే ఉంటున్నారు. పార్టీ నేతలు..కార్యకర్తలు అక్కడే కేసీఆర్ ను కలుస్తున్నారు. గురువారం పార్టీ నేతలు కేసీఆర్ ను కలుసుకున్నారు. రాత్రి కేసీఆర్ బాత్ రూమ్ లో కాలు జారి కింద పడ్డారు. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినట్లుగా ప్రాధమికంగా గుర్తించారు.

దీంతో, సోమాజీగూడలోనూ యశోద ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో కేసీఆర్ కు మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని..ఎటువంటి సమస్య లేదని వైద్యులు స్పష్టం చేసారు. తుంటికి చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత ఆస్పత్రిలో కొనసాగాలా..అవసరం లేదా అనేది వైద్యులు నిర్ణయించనున్నారు.
అర్దరరాత్రి ఈ ఘటన జరగటంతో అందుబాటులో ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా పార్టీ నేతలు ఫాం హౌస్ లో కేసీఆర్ ను కలుస్తున్నారు. వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. అధైర్యపడొద్దని, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారించి నిత్యం ప్రజల్లో ఉండాలని ఉద్బోధించారు.
దేశంలో మరే రాజకీయ పార్టీకిలేని పార్టీ బలం బీఆర్‌ఎస్‌కు ఉన్నదని, 60 లక్షల మంది పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ప్రజాసేవలో మమేకం అయ్యామో అదే స్థాయిలో ఇప్పుడూ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆటుపోట్లు సహజమని, ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ప్రజలకు దూరంగా ఉండటం నాయకుల లక్షణం కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications