యూరియా కోసం క్యూ లైన్ లో మాజీ మంత్రి - అక్కడే అసలు ట్విస్ట్..!!
తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత పైన విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. యూరియా కొరత పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదని హామీ ఇస్తోంది. కాగా, తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.
రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి.తెల్లవారు జామునుంచే యూరియా కోసం భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. క్యూలైన్‌లలో చెప్పులు, ఆధార్ కార్డులు ఉంచి యూరియా కోసం రోజులతరబడి ఎదురుచూస్తున్నారు. తాజాగా.. యూరియా కోసం ఓ మాజీ మంత్రి గంటల తరబడి క్యూలో నిలబడిన అంశం వైరల్ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత పైన రేవంత్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. అవగాహన లేని నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. చాలా సేపు నిలబడిన తరువాత ఒక యూరియా బస్తా దక్కింది.

మాజీ మంత్రి సత్యవతి రాథోడ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడి వేచి చూశారు. తన సొంత గ్రామం పెద్ద తాండలో తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా కోసం రాగా, కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన మహళలు..రైతులతో కలిసి సత్యవతి రాథోడ్ యూరియా కేంద్రం వద్ద వేచి చూసారు. అక్కడ యూరియా కోసం రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఏనాడు రాలేదని... విద్యుత్, నీరు అంశాల్లోనూ సమస్యలు రాకుండా రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టటం లేదని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications