మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు..!!
రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయననారు. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. సంపద పెంచాలని..పంచాలని సూచించారు,హన్మకొండలో ఒక విద్యా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. టెక్నాలజీలో భారత్ ముందుకు వెళ్తోందన్నారు. రాబోయే రోజుల్లో నాలుగవ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. చదువంటే నేర్చుకోవటం కాదని..ఇతరులకు నేర్పటమని వెంకయ్య నాయడు చెప్పుకొచ్చారు.
ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని..దీని వలన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని హెచ్చరించారు. ప్రకృతిని ప్రేమించటం యువత నేర్చుకోవాలని సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం మన సంప్రదాయాలను మనకు గుర్తు చేస్తుందని చెప్పారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని వెంకయ్య సూచించారు. ఇంగ్లీష్ బాష నేర్చుకోండి....ఇంగ్లీష్ సంస్కృతిని కాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. మాతృ బాష కళ్ళ లాంటిది...ఇంగ్లీష్ భాష కళ్ళద్దాల లాంటిదని చెప్పుకొచ్చారు. మమ్మి డాడీ సంస్కృతి మనకవసరమా అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులు కులాలు,మతాల పేరుతో మనల్ని వేరు చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

ఎడ్యుకేషన్ ఒక మిషన్ అని చెప్పిన వెంకయ్య నాయుడు..అది కమిషన్ కాకూడదన్నారు. క్లాస్ రూమ్ వరకే చదువు పరిమితం కాకూడదని హితవు చెప్పారు. బాడీ బిల్డింగ్ మాత్రమె కాదు నేషన్ బిల్డింగ్ కూడా చేయాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్ ను పక్కన పెట్టి....మిల్లెట్స్ తినడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తి చాలా శక్తి వంతమైనదని వెంకయ్య పేర్కొన్నారు. రాజకీయాలు భ్రష్టపట్టిపోతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్న కొన్ని రాజకీయ శక్తుల కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications